ఇంటికి పెద్దదిక్కుగా వున్న భర్త హటాత్తుగా చనిపోయాడు. దీంతో కుటుంబ బారాన్ని నెత్తినెత్తుకున్న భార్య తన భర్త ఉద్యోగం కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంది. అయితే ఆ ఉద్యోగం కావాలంటే తనకు భారీ మొత్తంలో లంచం సమర్పించుకోవాలని ఓ అధికారి డిమాండ్ చేశాడు. ఇప్పటికే భర్తలేక, కుటుంబ భారాన్ని మోయలేక భాధపడుతున్నఆమె అతడు అడిగిన లంచం ఇచ్చుకోలేక ఏసిబిని ఆశ్రయించింది. దీంతో రంగంలోకి దిగిన ఎసిబి అధికారులు లంచగొండి అధికారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. 

ఈ వ్యవహారానికి సంబంధించి ఎసిబి అధికారులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఖమ్మం జిల్లాలో ఎస్జీటి టీచర్ గా పనిచేస్తున్న వి. మల్లేశ్వరరావు ఇటీవలే అనారోగ్యంతో మరణించాడు. దీంతో కారుణ్య నియామకం కింద తనకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని మల్లేశ్వరరావు భార్య సంబంధిత అధికారులకు దరఖాస్తు చేసుకుంది. అయితే ఆమె చదువు మొత్తం ఆంధ్ర ప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లాలో సాగింది. నాన్ లోకల్ గా కావడంతో ఆమె ఉద్యగోనికి అడ్డంకి ఏర్పడింది. 

ఈ విషయంలో సహాయం చేసి ఆమెకు ఉద్యోగం ఇప్పిస్తానని...అయితే అందుకు గాను తనకు రెండున్నర లక్షల లంచం ఇవ్వాలని సచివాలయంలోని పంచాయితీ రాజ్ సెక్షన్ ఆఫీసర్ నాగరాజు డిమాండ్ చేశాడు. ఈ విషయంలో వీరి మధ్య చర్చ జరిగి చివరకు లక్షా ఇరవై వేలు ఇస్తే పని చేయించడానికి నాగరాజు ఒప్పుకున్నాడు.

అయితే నాగరాజు లంచం డిమాండ్ చేయడంపై ఏసిబి అధికారులకు ఫిర్యాదు అందింది. దీంతో ఇవాళ మహాత్మా గాంధి బస్ స్టేషన్ లో మొదటి విడతగా రూ.60వేలు లంచం తీసుకుంటుండగా ఏసిబి అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. డబ్బులను స్వాధీనం చేసుకోవడం పాటు నాగరాజును కూడా అదుపులోకి తీసుకున్నట్లు ఏసిబి అధికారులు తెలిపారు.

వీడియో

"