ఆమ్ ఆద్మీ పార్టీని దేశవ్యాప్తంగా విస్తరించేందుకు ఆ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వ్యూహాలు రచిస్తున్నారు. ఈ క్రమంలోనే త్వరలో ఎన్నికలు జరగనున్న తెలంగాణపై ఆయన దృష్టి పెట్టారు. దీనిలో భాగంగా ఇక్కడ పాదయాత్ర చేపడతామని ఆప్ కీలక నేత సోమ్‌నాథ్ భారతి తెలిపారు. 

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో (five state assembly elections) పంజాబ్‌ను (punjab) గెలిచిన ఆమ్ ఆద్మీ పార్టీ (aam aadmi party) మంచి జోష్‌లో వుంది. కాంగ్రెస్ (congress), బీజేపీ (bjp), శిరోమణి అకాలీదళ్ (shiromani akali dal) వంటి రాజకీయ దిగ్గజాలను మట్టికరిపించి ఆప్ .. పంజాబ్ గడ్డపై సరికొత్త చరిత్ర సృష్టించింది. కాంగ్రెస్ బలహీనతను క్యాష్ చేసుకుంటూ బీజేపీకి తామే ప్రత్యామ్నాయం అనే భావనను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు కేజ్రీవాల్ వ్యూహాలు రచిస్తున్నారు. దీనిలో భాగంగా ఆప్‌ను దేశవ్యాప్తంగా విస్తరించేందుకు కేజ్రీవాల్ పావులు కదుపుతున్నారు. దీనిలో భాగంగా ఈ ఏడాది చివరిలో, వచ్చే ఏడాది ఆరంభంలో ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలపై ఆయన దృష్టి కేంద్రీకరించారు. 

అటు దేశంలోని మిగిలిన రాష్ట్రాల‌పైనా దృష్టి సారించ‌నున్న‌ట్లుగా పార్టీ కేంద్ర నాయ‌క‌త్వం ప్ర‌క‌టించ‌గా, అందుకు అనుగుణంగా ఆయా రాష్ట్రాల్లో ఆ పార్టీ శ్రేణులు కూడా త‌మ ప్రాంతాల్లో జోరు పెంచుతున్నాయి. దీనిలో భాగంగా తెలంగాణ‌లో త్వ‌ర‌లోనే ఆప్ పాద‌యాత్ర మొద‌లు కానుంది. ఈ మేర‌కు ఆ పార్టీ పార్టీ దక్షిణాది రాష్ట్రాల ఇంచార్జ్ సోమనాథ్ భారతి మంగ‌ళ‌వారం ఓ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు.

మంగ‌ళ‌వారం నాడు ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. .. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సమస్యలపై ఆమ్ ఆద్మీ పార్టీ పోరాడుతుందని ప్రకటించారు. అందులో భాగంగా ఏప్రిల్ 14వ తేదీ నుంచి తెలంగాణలో పాదయాత్ర ప్రారంభిస్తామని భారతి తెలిపారు. ఈ పాదయాత్ర ద్వారా ఆప్ ల‌క్ష్యాల‌ను ఇంటింటికి తీసుకెళ్తామని సోమ్‌నాథ్ భార‌తి (somnath bharti) చెప్పారు. తొలగించిన ఫీల్డ్ అసిస్టెంట్లకు రెండేళ్ల జీతం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. 

రాష్ట్రవ్యాప్తంగా 70కి పైగా ఫీల్డ్ అసిస్టెంట్లు ఆత్మహత్యకు పాల్పడ్డారని తెలిపారు. వారికి కోటి రూపాయల నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అన్యాయంగా విధుల నుంచి బహిష్కరించిందని మండిపడ్డ భారతి. జాతీయ పార్టీలైన కాంగ్రెస్ , బీజేపీ ఈ అంశంపై మాట్లాడలేదంట ఫైరయ్యారు. ఆమ్‌ ఆద్మీ పార్టీ ఫీల్డ్ అసిస్టెంట్స్ కోసం పోరాడిందని ఆయ‌న గుర్తుచేశారు. ఇప్పటికే తెలంగాణలో ప‌లు రాజకీయ పార్టీల‌ నేతలు పాదయాత్రలో ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా ఇప్పుడు ఆప్ కూడా అదే సూత్రాన్ని ఫాలోకానుంది.

ఇకపోతే.. 2023లో పశ్చిమ బెంగాల్‌లో జరిగే పంచాయతీ ఎన్నికల్లో (west bengal panchayat election) ఆప్ పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటోంది. ఈ మేరకు పార్టీ అధిష్టానం నుంచి ఆదేశాలు వెళ్లాయి. ఈ మేరకు పశ్చిమ బెంగాల్ ఆప్ ఇంచార్జీ సంజయ్ బసు సోమవారం ఒక కీలక ప్రకటన చేశారు. పశ్చిమ బెంగాల్‌లో 2023లో జరిగే పంచాయతీ ఎన్నికల్లో తాము పోటీ చేస్తామని వెల్లడించారు. పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు ఇప్పటికే రాష్ట్రంలో క్యాంపెయిన్ ప్రారంభించామని వివరించారు. ఈ నెల 13వ తేదీన కోల్‌కతాలో ఆమ్ ఆద్మీ పార్టీ ఈ మేరకు ఓ ర్యాలీని కూడా నిర్వహించిందని తెలిపారు.