Asianet News TeluguAsianet News Telugu

పురుగులమందు తాగుతూ సెల్ఫీ వీడియో.. వాట్సాప్ స్టేటస్ గా పెట్టి.. చివరికి..

ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. దీన్నంతా సెల్ఫీ వీడియో తీసుకుని.. వాట్సాప్ స్టేటస్ లో పెట్టుకున్నాడు. అది కుటుంబ సభ్యులు చూడడంతో అతడిని ఆస్పత్రికి తరలించారు. 

A young man took a selfie video while committing suicide In peddapalli
Author
First Published Sep 6, 2022, 8:40 AM IST

పెద్దపల్లి : కుటుంబ సమస్యలతో విసిగిపోయిన ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. ఆ సమయంలో ఫోన్లో సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలం రొంపికుంటలో సోమవారం సాయంత్రం చోటు చేసుకుంది.  స్థానికుల కథనం ప్రకారం మానుపాటి సాయిలు-తిరుపతమ్మ దంపతుల రెండో కుమారుడు కార్తీక్ (22) డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఇటీవలే కానిస్టేబుల్ పరీక్షలకు సైతం హాజరయ్యారు. కాగా కుటుంబ కలహాలతో మనస్థాపానికి గురయ్యాడు. సోమవారం సాయంత్రం ఇంట్లో సెల్ఫీ వీడియో తీసుకుంటూ పురుగుల మందు తాగాడు. ఆ తర్వాత పొలం వద్దకు వెళ్లి వీడియోను వాట్సాప్ స్టేటస్ గా పెట్టుకున్నాడు.

‘మా బాపులా ఎవరూ చెయ్యద్దు. పిల్లల జీవితాలను నాశనం చేయొద్దు.. అందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నా’ అని మాట్లాడటం ఆ వీడియోలో కనిపిస్తుంది. వాట్సాప్ స్టేటస్ చూసి కుటుంబ సభ్యులు కార్తీక్ కు ఫోన్ చేయడంతో విషయం చెప్పాడు. వెంటనే వాళ్లు పొలం వద్దకు వెళ్లి.. కార్తీక్ ను పెద్దపల్లిలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.  జిల్లా గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ గుడిసె గట్టయ్యయాదవ్ తో పాటు టిఆర్ఎస్ సీనియర్ నాయకులు పెండం రాజేష్ ఆసుపత్రికి వెళ్లి కార్తీక్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. కాగా ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని షేక్ మస్తాన్ తెలిపారు. 

నిద్ర రావట్లేదని ఆత్మహత్య.. హాస్టల్‌లో రాత్రిళ్లు తిరుగుతూ.. చివరకు తీవ్ర నిర్ణయం

ఇదిలా ఉండగా, తమ వివాహేతర సంబంధానికి ఇంట్లో ఒప్పుకోలేదని.. ఓ జంట ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆంధ్రప్రదేశ్ లో ఆగస్ట్ 30న వెలుగులోకి వచ్చింది. రణస్థలం మండలం జేఆర్ పురం పంచాయతీ దండనపేటకు చెందిన పొగిరి సీతమ్మ (32), అల్లివలస గ్రామానికి చెందిన దుమ్ము అమ్మోరు(30) ఆదివారం రాత్రి ఒకే ఇంట్లో విగతజీవులుగా పడి ఉండటం స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సీతమ్మ భర్త అనారోగ్యంతో 2013లో మృతి చెందాడు. కుటుంబ పోషణ నిమిత్తం ఆమె జేఆర్ పురం కూడలిలో కూరగాయల దుకాణం నిర్వహిస్తుంది.

ఇదే సమయంలో అల్లివలస గ్రామానికి చెందిన దుమ్ము అమ్మోరు తన బంధువులతో కలిసి జేఆర్ పురంలోనే ఓహోటల్, లాడ్జి లీజుకు తీసుకుని నడిపేవాడు. స్థానికంగా వెంకటేశ్వర కాలనీలోనే కుటుంబంతో సహా నివాసం ఉండేవాడు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగి వివాహేతర సంబంధానికి దారితీసింది. కరోనా సమయంలో ఇద్దరి వ్యాపారాలు సాగక ఇంటివద్దే ఉండిపోయారు. కరోనా తగ్గిన తర్వాత సీతమ్మ గ్రామంలోని ఇంటి సమీపంలో కూరగాయల దుకాణం ఏర్పాటు చేసుకుంది. అమ్మోరు వ్యాపారం నడవలేక, మరొకరికి ఇచ్చేసి  విశాఖ స్టీల్ ప్లాంట్ పరిసరాల్లో కళ్లద్దాలు విక్రయించేందుకు వెళ్ళిపోయాడు. 

ఈ క్రమంలో అమ్మోరు ఆదివారం రాత్రి సీతమ్మ ఇంటికి వచ్చాడు.  ఆ రాత్రి ఏం జరిగిందో, ఏమో…తెల్లారేసరికి ఇద్దరూ విగతజీవులుగా కనిపించారు. సీతమ్మ కొడుకు ఇంట్లోనే ఉన్న ఈ విషయమే అతనికి తెలియలేదు. సోమవారం ఉదయం 5 గంటల సమయంలో సీతమ్మ మామ వచ్చి తలుపు తట్టాడు. ఎవరు తీయకపోవడంతో మళ్లీ గట్టిగా కొట్టాడు. ఆ శబ్దానికి మనవడు లేచివచ్చి తలుపు తీశాడు. లోపలికి వెళ్లి చూడగా  ఇద్దరూ చనిపోయి కనిపించారు. వెంటనే ఈ విషయం చుట్టుపక్కల వారికి పోలీసులకు తెలియజేశాడు. మృతుడి భార్య, ఏడాది కుమార్తె, నాలుగు నెలల వయసున్న కుమారుడు ఉన్నారు. మృతురాలికి ఒక కుమారుడు ఉండగా అతను ఆరో తరగతి చదువుతున్నాడు. ‘నేను సీతమ్మ తో కలిసి ఉండడం వారి కుటుంబ సభ్యులకు ఇష్టం లేదు. దీంతో ఆత్మహత్య చేసుకుంటున్నాం. పిల్లలను బాగా చూసుకోవాలి’ అని కుటుంబ సభ్యులను కోరుతూ రాసిన ఓ లేఖ అమ్మోరు చొక్కా జేబులో నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  

Follow Us:
Download App:
  • android
  • ios