పాస్ పోర్టులో భార్య పేరు తప్పుగా నమోదు అవడంతో గల్ఫ్ లో చనిపోయిన ఓ వ్యక్తి డెడ్ బాడీని స్వస్థలానికి తీసుకురావడంలో అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి. చివరికి అధికారులు, స్వచ్ఛంధ సేవా సంస్థ సభ్యులు చొరవ చూపడంతో మృతదేహం మంగళవారం స్వగ్రామానికి చేరుకుంది.
పాస్ పోర్టులో మొదటి భార్య పేరు మార్చకపోవడం అనేక కష్టాలను తెచ్చిపెట్టింది. బతుకుదెరువు కోసం గల్ప్ కు వెళ్లిన ఓ వ్యక్తి గుండెపోటుతో మరణించడంతో ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆయన డెడ్ బాడీని స్వగ్రామానికి తీసుకువచ్చేందుకు అష్టకష్టాలు పడ్డారు. చివరికి తెలంగాణ ప్రభుత్వ, ప్రవాసీ మిత్ర, గల్ఫ్ జేఏసీ సభ్యుల చొరవతో డెడ్ బాడీ ఇంటికి చేరింది.
ప్రసాదం బదులు డబ్బులు పంచిన పూజారి.. ఎగబడ్డ జనం.. ఎక్కడంటే..
వివరాలు ఇలా ఉన్నాయి. నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్ మండలం పెంబికి చెందిన దాసర్ల సంతోష్ (39) బతుకుదెరువు కోసం దుబాయికు వెళ్లారు. ఆయనకు కొంత కాలం కిందట కళావతి అనే మహిళను పెళ్లి చేసుకున్నారు. ఆ సమయంలోనే అతడు గల్ఫ్ వెళ్లేందుకు పాస్ పోర్టు తీసుకున్నాడు. అందులో భార్య పేరును నమోదు చేయించారు. అయితే కొన్నేళ్ల కిందట అతడి భార్య కళావతి చనిపోయారు. దీంతో ఆయన రెండో పెళ్లి చేసుకున్నారు.
రెండో భార్య పేరు దండ్ల వందన. కానీ సంతోష్ తన పాస్ పోర్టులో మొదటి భార్య ను తొలగించి రెండో భార్య పేరును చేర్చలేదు. ఇదే అతడికి సమస్యలను తెచ్చిపెట్టింది. ఎప్పటిలాగే దుబాయ్ కి వెళ్లి ఉద్యోగం చేస్తున్న సంతోష్ కు ఇటీవల గుండెపోటుతో చనిపోయారు. సౌదీ అరేబియాలో ఆయన మరణించారు. అతడి డెడ్ బాడీని అంత్యక్రియల కోసం ఇండియాకు తీసుకురావాల్సి ఉండగా.. దానికి భార్య అఫిడవిట్ అవసరం ఉంటుంది.
విదేశీ జంతువుల అక్రమ రవాణా... ప్రయాణికుడి అరెస్ట్...!
అధికారుల సూచన మేరకు ఆమె అఫిడవిట్ ను పంపించారు. కానీ దానిని ఇండియన్ ఎంబసీ రిజెక్ట్ చేసింది. సంతోష్ పాస్ పోర్టులో భార్య పేరు కళావతి అని ఉందని, కానీ సర్టిఫికెట్లలో ఆమె పేరు వందన ఉందని, అవి రెండు సరిపోలడం లేదని పేర్కొంటూ ఆ అఫిడవిట్ ను తిరస్కరించింది. ఈ విషయాన్ని ఇండియన్ ఎంబసీ తెలంగాణ ప్రభుత్వానికి నివేదించింది.
మేనబావ అని ఆశ్రయిస్తే.. మరదలిపై ఐదేళ్లుగా పోలీసు అత్యాచారం, అయిదుసార్లు అబార్షన్.. చివరికి...
తెలంగాణ ప్రభుత్వం ఈ విషయంపై విచారణ జరపాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ కు ఆదేశాలు పంపించింది. దీంతో అధికారులు తప్పు ఎక్కడ జరిగిందో గుర్తించారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు అసవరమైన చర్యలు తీసుకున్నారు. సంతోష్ భార్య వందనే అని నిర్ధారించారు. ఈ విషయాన్ని ఇండియన్ ఎంబసీకి తెలియజేశారు. దీంతో ఎంబసీ ఎన్ ఓసీని విడుదల చేసింది. దీంతో సంతోష్ డెడ్ బాడీ మంగళవారం స్వగ్రామానికి చేరుకుంది. బాధిత కుటుంబానికి స్వచ్ఛంద సేవా సంస్థ అయిన ప్రవాసీ మిత్ర ప్రెసిడెంట్ పిరికిపండ్ల స్వదేశ్, గల్ఫ్ జాయింట్ యాక్షన్ కమిటీ నాయకుడు గంగుల మురళీధర్ రెడ్డి ఎంతో సహాయం చేశారు.
