Asianet News TeluguAsianet News Telugu

అయ్యో.. మాజీ మంత్రులకు చేదు అనుభవం.. మీడియా పాయింట్ కు రానివ్వని పోలీసులు, మార్షల్స్ (వీడియోలు)

తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో బీఆర్ఎస్ సభ్యులకు చేదు అనుభవం ఎదురైంది. మీడియా పాయింట్ వద్దకు వెళ్లేందుకు వారిని అధికారులు అనుమతించలేదు. దీంతో సభ్యులు అక్కడే నిరసన తెలిపారు.

A bitter experience for former ministers. The police stopped him from coming to the media point. BRS leaders protest..ISR
Author
First Published Feb 14, 2024, 2:59 PM IST

ప్రభుత్వంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకులను గడగడలాడించిన మాజీ మంత్రులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వారు. కానీ అధికారం కోల్పోయి, ప్రతిపక్షంలో కూర్చోగానే పరిస్థితితులు అన్నీ మారిపోయాయి. గతంలో వాళ్లు చెప్పినట్టుగా విన్న పోలీసులు, అధికారులు.. ఇప్పుడు వారికే అడ్డుపడుతున్నారు. తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో ఈ బుధవారం ఈ దృశ్యం కనిపించింది. 

తెలంగాణ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఎప్పటిలాగే అధికార, ప్రతిపక్ష నాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. కాంగ్రెస్ సభ్యుల వైఖరిని నిరసిస్తూ బీఆర్ఎస్ సభ్యులు సభ నుంచి బయటకు వచ్చారు. ఇందులో మాజీ మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్, ప్రశాంత్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, కడియం శ్రీహరి, ఎమ్మెల్యే సంజయ్ కుమార్, కౌశిక్ రెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు ఉన్నారు. తరువాత మీడియా పాయింట్ వద్దకు వెళ్లేందుకు బయలుదేరారు. 

మీడియా పాయింట్ వద్దకు చేరుకోగానే బారికేడ్లు ఉండటంతో వారిని ఆగిపోయారు. వాటిని తొలగించి వెళ్లేందుకు నాయకులు ప్రయత్నించగా.. పోలీసులు, మార్షల్స్ అడ్డుకున్నారు. మీడియా పాయింట్ వద్దకు వెళ్లేందుకు అనుమతి లేదని తేల్చి చెప్పారు. వారి తీరుపై మాజీ మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్, కడియం శ్రీహరి ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో సభ కొనసాగుతుండగానే కాంగ్రెస్ సభ్యులు మీడియా పాయింట్ వద్దకు వచ్చే వారని, కానీ ఇప్పుడు కొత్తగా తమను ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు.

కానీ ఎంత సేపటికీ అధికారులు వారికి మీడియా పాయింట్ వద్దకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వలేదు. దీంతో మాజీ మంత్రులు, ఇతర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అక్కడే బైఠాయించారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios