Asianet News TeluguAsianet News Telugu

కొత్తగా 99 మందికి పాజిటివ్, నలుగురి మృతి: తెలంగాణలో 3 వేలకు చేరువలో కరోనా కేసులు

తెలంగాణలో కరోనా కేసులు ఏ మాత్రం తగ్గడం లేదు. మంగళవారం కొత్తగా 99 కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇందులో తెలంగాణ పరిధిలోని 87 కాగా.. 12 మందికి వలస కూలీలకు ఈ మహమ్మారి సోకింది

99 new corona cases reported in telangana
Author
Hyderabad, First Published Jun 2, 2020, 10:24 PM IST

తెలంగాణలో కరోనా కేసులు ఏ మాత్రం తగ్గడం లేదు. మంగళవారం కొత్తగా 99 కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇందులో తెలంగాణ పరిధిలోని 87 కాగా.. 12 మందికి వలస కూలీలకు ఈ మహమ్మారి సోకింది.

వీటిలో ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే 70 కేసులు నమోదవ్వగా... రంగారెడ్డి 07, మేడ్చల్ 03, నల్గొండలో 2, మహబూబ్‌నగర్, జగిత్యాల, మంచిర్యాల, సంగారెడ్డిలో ఒక్కో కేసు నమోదయ్యాయి.

ఇవాళ నమోదైన కేసుల సంఖ్య 2,891కి చేరింది. మంగళవారం నలుగురు మరణించడంతో... మొత్తం మరణాల సంఖ్య 92కి చేరుకుంది. ఇప్పటి వరకు 1,526 మంది కోవిడ్ 19 నుంచి కోలుకోవడంతో.. 1,273 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 

Also Read:రెండు లక్షలకు చేరువలో భారత్.. 24గంటల్లో ...

భారత్ లో కరోనా వైరస్ కేసులు రోజు రోజుకి పెరుగుతున్నాయి. వరసగా రెండు రోజుల పాటు 8వేల పై చిలుకు కేసులు నమోదవ్వగా.. సోమవారం కూడా 8వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. శనివారం  8,380 కరోనా కేసులు నమోదయితే, ఆదివారం 8,392 కేసులు నమోదయ్యాయి. కాగా సోమవారం 8,171 కేసులు నమోదవ్వడం గమనార్హం.

మొత్తం కేసుల సంఖ్యా లక్షా తొంభై వెలను దాటాయి. ఇప్పటి వరకు దేశంలో 1,98,706 కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటివరకు కరోనా వైరస్ బారినపడి 5,598 మంది మరణించారు. 

ఇకపోతే.... భారతదేశంలో కరోనా వైరస్ మహమ్మారి విలయతాండవం సృష్టిస్తోంది. లాక్ డౌన్ ను కూడా సడలించడంతో కేసుల సంఖ్యా అంతకంతకు పెరుగుతూ ఏ రోజుకారోజు అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. 

ఇప్పటికే అత్యధిక కేసులు నమోదవుతుండడంతో ప్రపంచంలో కరోనా వైరస్ బారినపడ్డ టాప్ 10 దేశాల్లో భారత్ కూడా చేరిపోయింది. తాజాగా 1,98,000 పైచిలుకు కేసులతో టాప్ 10 లో 9వ స్థానంలో ఉన్న భారత్ రెండు స్థానాలు ఎగబాకి 7వ స్థానానికి చేరుకుంది. 

18 లక్షల పైచిలుకు కేసులతో అమెరికా అగ్ర స్థానములో ఉండగా, ఆతరువాత 5 లక్షల పైచిలుకు కేసులతో బ్రెజిల్, నాలుగు లక్షల కేసులతో రష్యా ఆ తరువాతి స్థానాల్లో ఉన్నాయి. 

ఇకపోతే... కరోనా నేపథ్యంలో గత రెండు నెలలుగా కొనసాగుతున్న లాక్ డౌన్ ను కేంద్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది. మరిన్ని సడలింపులతో లాక్ డౌన్ ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది
 

Follow Us:
Download App:
  • android
  • ios