తెలంగాణలో 16 వేలు దాటిన కేసులు: ఇవాళ 945 మందికి పాజిటివ్, 1,712 మంది డిశ్చార్జ్

తెలంగాణలో కరోనా కేసుల విలయ తాండవం చేస్తోంది. కేసుల్లో తగ్గుదల కనిపించకపోగా... అంతకంతకూ పెరిగిపోతోంది. మంగళవారం కొత్తగా 945 కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది

945 new coronacases reported in telangana

తెలంగాణలో కరోనా కేసుల విలయ తాండవం చేస్తోంది. కేసుల్లో తగ్గుదల కనిపించకపోగా... అంతకంతకూ పెరిగిపోతోంది. మంగళవారం కొత్తగా 945 కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.

వీటితో కలిపి తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య 16,339కి చేరుకుంది. వైరస్ కారణంగా ఇవాళ ఏడుగురు మరణించడంతో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 260కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 8,785 యాక్టివ్ కేసులు ఉండగా.. 7,294 మంది కోలుకున్నారు. మంగళవారం ఒక్కరోజే 1,712 మంది ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు.  

హైదరాబాద్‌లో 869 మందికి పాజిటివ్‌గా తేలగా.. రంగారెడ్డి 29, సంగారెడ్డి 21, మేడ్చల్ 13, నిర్మల్ 4, కరీంనగర్ 2, సిద్ధిపేట, సూర్యాపేట, ఖమ్మం, వికారాబాద్, నిజామాబాద్‌లలో ఒక్కో కేసు నమోదైంది.

జీహెచ్ఎంసీ పరిధిలో 50 వేల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ఈ మేరకు ఈ నెల 16వ తేదీ నుండి జీహెచ్ఎంసీ పరిధిలోని పలు సెంటర్లలో కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు.

తొమ్మిది రోజుల్లో 36 వేల మంది నుండి  శాంపిల్స్ సేకరించారు. దీంతో ప్రభుత్వ ల్యాబ్స్ రోజంతా పనిచేసినా కూడ సేకరించిన శాంపిల్స్ ను ఫలితాలు తేల్చలేని పరిస్థితి ఉంది.

దీంతో శాంపిల్స్ సేకరణను నిలిపివేసింది వైద్య ఆరోగ్యశాఖ. సేకరించిన శాంపిల్స్ ను పరీక్షలు పూర్తయ్యాయి. దీంతో ఈ  జూన్ 30వ తేదీ నుండి ఉచితంగా కరోనా నిర్ధారణ పరీక్షలను ప్రారంభించింది వైద్య ఆరోగ్య శాఖ.

ఒక్కసారి సేకరించిన శాంపిల్స్ ను 48 గంటల్లోపుగా పరీక్షలు ప్రారంభించకపోతే ఆ శాంపిల్స్ కు ఉపయోగం ఉండదు. 48 గంటల తర్వాత శాంపిల్స్ పరీక్షిస్తే నెగిటివ్ గా వస్తోందని నిపుణులు చెబుతున్నారు.దీంతో సేకరించిన శాంపిల్స్ ను  రిజల్ట్స్ వచ్చిన తర్వాతే కొత్తగా శాంపిల్స్ సేకరణను ప్రారంభించారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios