ఒక్క రోజులో ఆరుగురు మృతి, 94 కేసులు: తెలంగాణలో ఏమాత్రం తగ్గని కరోనా ఉద్థృతి
తెలంగాణలో కరోనా వైరస్ కేసులు ఉద్ధృతి ఏమాత్రం తగ్గడం లేదు. తాజాగా సోమవారం కొత్తగా 94 మందికి పాజిటివ్‌గా తేలింది. వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2,792కి చేరిందని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది
తెలంగాణలో కరోనా వైరస్ కేసులు ఉద్ధృతి ఏమాత్రం తగ్గడం లేదు. తాజాగా సోమవారం కొత్తగా 94 మందికి పాజిటివ్‌గా తేలింది. వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2,792కి చేరిందని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది.
24 గంటల్లో వైరస్‌కు ఆరుగురు బలవ్వడంతో మరణాల సంఖ్య 88కి చేరింది. ఇప్పటి వరకు 1,491 మంది డిశ్చార్జ్ కాగా.. 1,213 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
Also Read:తెలంగాణ బిజెపి నేతకు కరోనా పాజిటివ్: ఇంట్లో మరొకరికి కూడా..
సోమవారం జీహెచ్ఎంసీ పరిధిలోనే 79 మందికి, రంగారెడ్డిలో 3, మేడ్చల్‌లో 3, నల్గొండ, సంగారెడ్డి, మెదక్, మహబూబాబాద్ జిల్లాల్లో ఇద్దరు చొప్పున, పెద్దపల్లి, జనగామ జిల్లాలో ఒక్కో కేసు నమోదైందని అధికారులు తెలిపారు.
కాగా తెలంగాణకు చెందిన ఓ బీజేపీ నేతకు కరోనా సోకినట్లుగా తెలుస్తోంది. ఆయన కుటుంబంలోని మరొకరికి కూడా వైరస్ పాజిటివ్‌గా తేలడంతో కలకలం రేగింది. కరోనా సోకిన నేత గతంలో ఎమ్మెల్యేగా కూడా పనిచేసినట్లు సమాచారం.
Also Read:క్వారంటైన్ లో కుటుంబ సభ్యులు, అనాథ శవంగా అంత్యక్రియలు చేసిన జిహెచ్ఎంసి సిబ్బంది
ఆయన ప్రస్తుతం ఓ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లుగా చెబుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్ధితి నిలకడగానే ఉన్నట్లు సమాచారం.