హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ వ్యాధి చాప కింద నీరులా విస్తరిస్తూనే ఉంది. ఎంతగా చర్యలు తీసుకున్న దాని వ్యాప్తి ఆగడం లేదు. తాజాగా, తెలంగాణ బిజెపి నేత ఒకరికి కరోనా వైరస్ సోకినట్లు తెలుస్తోంది. ఆయన కుటుంబంలోని మరొకరికి కూడా కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ అయింది. 

కరోనా వైరస్ సోకిన బిజెపి నేత మాజీ ఎమ్మెల్యే కూడా. ఆయన ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు చెబుతున్నారు. అయితే, కరోనా వైరస్ సోకినప్పటికీ తాను ఆరోగ్యంగానే ఉన్నానని చెప్పారు. హైదరాబాదులో కరోనా వైరస్ విపరీతంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో హైదరాబాదుకు చెందిన ఆ నేతకు కరోనా వైరస్ సోకింది. 

ఆదివారం ఒక్క రోజే తెలంగాణలో 199 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్టంలో మొత్తం కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 2,698కి చేరుకుంది. కరోనా వైరస్ కారణంగా ఆదివారం ఆరుగురు మరణించారు. దాంతో మృతుల సంఖ్య 82కు చేరుకుంది. 

జిహెచ్ఎంసి పరిధిలో ఆదివారంనాడు 122 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 40 కేసులు నమోదయ్యాయి. మేడ్చల్ జిల్లాలో 10, మహబూబ్ నగర్ లో 3, వరంగల్ అర్బన్ లో 2, సూర్యాపేటలో ొ, నిర్మల్ జిల్లాలో  కేసులు నమోదయ్యాయి. 

మొత్తం కేసుల్లో 434 కేసులు ఇతర రాష్ట్రాల నుంచి వారివల్ల నమోదైనవే. తెలంగాణలో ఇప్పటి వరకు 1,428 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జీ కాగా, 1,188 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.