తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ దాదాపుగా అదుపులోకి వచ్చినట్లుగానే కనిపిస్తోంది. గడిచిన 24 గంటల్లో 1,09,802 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 917 కొత్త కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది

తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ దాదాపుగా అదుపులోకి వచ్చినట్లుగానే కనిపిస్తోంది. గడిచిన 24 గంటల్లో 1,09,802 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 917 కొత్త కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో తెలంగాణలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసులు 6,23,510కు చేరుకున్నాయి. గత 24 గంటల వ్యవధిలో కోవిడ్ వల్ల 10 మంది ప్రాణాలు కోల్పోయారు. వీటితో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో మృతుల సంఖ్య 3,661కి చేరింది. 24 గంటల వ్యవధిలో 1,006 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 6,06,461కి చేరింది. ప్రస్తుతం తెలంగాణలో 13,388 యాక్టివ్‌ కేసులున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే.. ఆదిలాబాద్ 2, భద్రాద్రి కొత్తగూడెం 52, జీహెచ్ఎంసీ 108, జగిత్యాల 28, జనగామ 9, జయశంకర్ భూపాలపల్లి 17, గద్వాల 1, కామారెడ్డి 5, కరీంనగర్ 66, ఖమ్మం 58, ఆసిఫాబాద్ 5, మహబూబ్‌నగర్ 19, మహబూబాబాద్ 53, మంచిర్యాల 61, మెదక్ 7, మేడ్చల్ మల్కాజిగిరి 35, ములుగు 18, నాగర్ కర్నూల్ 7, నల్గగొండ 71, నారాయణపేట 4, నిర్మల్ 4, నిజామాబాద్ 9, పెద్దపల్లి 39, సిరిసిల్ల 20, రంగారెడ్డి 43, సిద్దిపేట 29, సంగారెడ్డి 7, సూర్యాపేట 57, వికారాబాద్ 7, వనపర్తి 10, వరంగల్ రూరల్ 11, వరంగల్ అర్బన్ 36, యాదాద్రి భువనగిరిలో 19 చొప్పున కేసులు నమోదయ్యాయి. 

Scroll to load tweet…