Asianet News TeluguAsianet News Telugu

రిపబ్లికే డే : 901 మంది పోలీసులకు కేంద్రం మెడల్స్.. తెలంగాణ నుంచి 15 మందికి, జాబితా ఇదే

రిపబ్లిక్ డే సందర్భంగా విధి నిర్వహణలో అత్యుత్తమ ప్రతిభ చూపిన పోలీస్ అధికారులకు కేంద్ర ప్రభుత్వం మెడల్స్ ప్రకటించింది. మొత్తం 901 మంది అధికారులకు ఈ అవార్డ్‌లు దక్కాయి. 
 

901 police personnel get medals over republic day
Author
First Published Jan 25, 2023, 8:26 PM IST

గణతంత్ర దినోత్సవం సందర్భంగా  901 మంది పోలీసులకు కేంద్రం మెడల్స్ ప్రకటించింది. ఈ ఏడాది 140 మందికి పోలీస్ మెడల్ ఫర్ గ్యాలంట్రీ (పిఎంజి) అవార్డులు ప్రకటించగా.. 93 మందికి ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ ఫర్ డిస్టింగ్విష్డ్ సర్వీస్(పిపిఎం) అవార్డులు దక్కాయి. అలాగే 668 మందికి పోలీస్ మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్(పిఎం) అవార్డులు ప్రకటించారు. 140 గ్యాలంట్రీ అవార్డులో ఎక్కువ భాగం లెఫ్ట్ వింగ్ తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో పని చేసిన అధికారులనే వరించాయి. వీరిలో 80 మంది జమ్మూకాశ్మీర్ పోలీస్ సిబ్బంది కావడం విశేషం. 45 మందికి సాహసోపేతమైన విభాగంలో అవార్డులు దక్కాయి. గ్యాలంట్రీ అవార్డులలో 48 మంది సీఆర్పీఎఫ్, 31 మంది మహారాష్ట్ర అధికారులు వున్నారు. అలాగే 25 మంది జమ్మూకాశ్మీర్ పోలీసులు, 9 మంది జార్ఖండ్ అధికారులు, ఏడుగురు ఢిల్లీ పోలీసులు,పలువురు ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వారు వున్నారు. 

తెలంగాణకు చెందిన అనిల్ కుమార్ (ఏడీజీ), బ్రుంగి రామకృష్ణ (టీఎస్ఎస్పి 12 బెటాలియన్ ఏసీ)కి ప్రెసిడెంట్ పోలీస్ మెడల్స్ (పిపిఎం) దక్కాయి. అలాగే రాష్ట్రానికి చెందిన 13 మంది పోలీసులకు పిఎం మెరిటోరియస్ సర్వీస్ అవార్డులు దక్కాయి. 

పిఎం మెరిటోరియస్ సర్వీస్ అవార్డులు దక్కిన తెలంగాణ పోలీస్ అధికారులు :

  1. తరుణ్ జోషి (వరంగల్ సీపీ), 
  2. పేర్ల విశ్వ ప్రసాద్(జేసీపీ, హైదరాబాద్), 
  3. గంగసాని శ్రీధర్(ఏసీపీ, సైబర్ క్రైం), 
  4. పి నర్సింహా(డిఎస్పీ రిజీనల్ ఇంటలిజెన్స్), 
  5. ఆర్ అరుణ్ రాజ్(డీఎస్పీ, బేగంపేట్), 
  6. జి వెంకటేశ్వర్లు(సిఐ, సిటీ స్పెషల్ బ్రాంచ్), 
  7. ఎం శ్రీధర్ రెడ్డి (సిఐ, ఐటీ సెల్), 
  8. ఎన్ ఎస్ జైశంకర్(ఏఆర్ ఎస్ఐ, 3 బెటాలియన్), 
  9. కె దయసీల(ఆర్ఐ, వరంగల్), 
  10. జీ అచ్యుతా రెడ్డి (ఏఏసీ గ్రేహౌండ్స్), 
  11. ఎన్ రాందేవ్ రెడ్డి (సిఐ, ఇంటలిజెన్స్), 
  12. వీర రామాంజనేయులు(ఏఆర్ ఎస్ఐ, ఇంటలిజెన్స్), 
  13. బి వి సన్యాసీ రావు(టీఎస్ పీఎస్ హైదరాబాద్)
Follow Us:
Download App:
  • android
  • ios