మహబూబ్ నగర్ జిల్లాలో దారుణం జరిగింది. తొమ్మిదేళ్ల చిన్నారిపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. మహబూబ్‌నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక గ్రామంలో పెట్టిన వినాయక మండపం దగ్గరికి వెళ్లి దర్శనానంతరం తిరిగి ఇంటికి బయల్దేరింది.

ఆ సమయంలో బైకుపై వచ్చిన ఓ యువకుడు ఇంటి దగ్గర దిగబెడతానని చెప్పి చిన్నారిని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు.  కామాంధుడిని పట్టుకున్న స్థానికులు చితకబాది, పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు చిన్నారిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.