Asianet News Telugu

బ్లాక్ మార్కెట్లో బ్లాక్ ఫంగస్ మందులు విక్రయిస్తున్న 9 మంది అరెస్ట్: సీపీ అంజనీకుమార్

బ్లాక్ ఫంగస్ కు ఉపయోగించే మందులను బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్న 9 మంది  సభ్యులను అరెస్ట్ చేసినట్టుగా హైద్రాబాద్ సీపీ అంజనీకుమార్ తెలిపారు. 
 

9 members team arrested in Hyderabad for black marketing black fungus medicine lns
Author
Hyderabad, First Published Jun 17, 2021, 3:40 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

హైదరాబాద్: బ్లాక్ ఫంగస్ కు ఉపయోగించే మందులను బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్న 9 మంది  సభ్యులను అరెస్ట్ చేసినట్టుగా హైద్రాబాద్ సీపీ అంజనీకుమార్ తెలిపారు. గురువారం నాడు తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. బ్లాక్ ఫంగస్ కు ఉపయోగించే మందులను  బ్లాక్ మార్కెట్ లో  తొమ్మిది మంది సభ్యులు బ్లాక్ మార్కెట్‌లో విక్రయిస్తున్నారని ఆయన చెప్పారు.  ఈ ముఠాను హైద్రాబాద్ వెస్ట్‌జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు కచ్చితమైన సమాచారం ఆధారంగా  అరెస్ట్ చేశారని ఆయన చెప్పారు. 

 

 

 

మహ్మద్ అలీముద్దీన్, నిరంజన్, సురేష్, శశికుమార్, శ్రీకాంత్, వినోద్ లు బ్లాక్ ఫంగస్ మందులను విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన చెప్పారు. మరో ముఠాగా కూడ బ్లాక్ ఫంగస్ మందులను విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన చెప్పారు. అన్వేష్ కుమార్ రెడ్డి, రంజిత్, అబ్దుల్ సలీం, బాలస్వామిలు బ్లాక్ ఫంగస్ మందులను విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన తెలిపారు.

 ఈ రెండు ముఠాల్లో 9మందిని అరెస్ట్ చేశామన్నారు.గుంటూరుకు చెందిన వినోద్ పరారీలో ఉన్నాడని సీపీ తెలిపారు. కరోనా, బ్లాక్ ఫంగస్ మందులు బ్లాక్ మార్కెట్ కు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తామని సీపీ హెచ్చరించారు. ఈ రెండు ముఠాల నుండి 28 అంపోటెరిసిన్-బి ఇంజక్షన్లను స్వాధీనం చేసుకొన్నామని ఆయన చెప్పారు. ఒక్కో ఇంజక్షన్ ను రూ. 35 వేల నేుండి రూ. 50 వేల చొప్పున విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన వివరించారు. 


 

Follow Us:
Download App:
  • android
  • ios