Asianet News TeluguAsianet News Telugu

Omicron వ్యాప్తి సమయంలో... జగిత్యాల జిల్లాలో తొమ్మిదిమంది విద్యార్థులకు కరోనా పాజిటివ్

ఓవైపు ప్రపంచ దేశాలను కొత్త కరోనా వేరియంట్ ఒమిక్రాన్ భయపెడుతున్న సమయంలో జగిత్యాల జిల్లాలో భారీగా విద్యార్థులు కరోనాబారిన పడటం కలకలం రేపుతోంది.

9 gurukula, 1 private school students test positive for covid19 in jagitial district
Author
Jagtial, First Published Dec 3, 2021, 11:53 AM IST

జగిత్యాల: ప్రస్తుతం కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భయం యావత్ ప్రపంచాన్ని వెంటాడుతోంది. దక్షిణాఫ్రికాలో భయటపడ్డ ఈ omicron వేరియంట్ ప్రపంచ దేశాలకు వేగంగా వ్యాపిస్తూ భారత్ ను కూడా చేరింది. ఇలాంటి భయానక సమయంలో తెలంగాణలోని స్కూళ్లలో విద్యార్థులు కరోనాబారిన పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే సంగారెడ్డి  జిల్లాలోని స్కూళ్లలో భారీగా కరోనా కేసులు భయటపడగా తాజాగా జగిత్యాల జిల్లాలోనూ విద్యార్థులకు కరోనా బారిన పడ్డారు.  

jagitial district మల్యాల మండలం తాటిపల్లిలోని ప్రభుత్వ బాలికల గురుకుల పాఠశాలలో తొమ్మిదిమంది విద్యార్థులకు కరోనా సోకింది. ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో అప్రమత్తమైన ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా టెస్టుల సంఖ్య పెంచింది. ఇందులో భాగంగానే స్కూళ్లలో కూడా విద్యార్థులకు కరోనా టెస్టులు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాటిపల్లి స్కూళ్ళో విద్యార్థలకు పరీక్షలు నిర్వహించగా ఏకంగా తొమ్మిది corona పాజిటివ్ కేసులు బయటపడ్డాయి.  

తోటి విద్యార్థులు కరోనా బారినపడటంతో తాటిపల్లి residencial school లో చదివే మిగతా విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. అలాగే ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రుల్లో కూడా భయాందోళన నెలకొంది. 

read more  Omicron: భారత్ లో బయటపడ్డ ఒమిక్రాన్, కర్ణాటకలో ఇద్దరికి...

గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ.... ఆర్టీపీఆర్ పరీక్షల్లో తొమ్మిదిమంది విద్యార్థులకు పాజిటివ్ గా నిర్దారణ అయినట్లు తెలిపారు. గురుకుల పాఠశాలలో ఇంటరు విద్యార్థులతో కలిపి మొత్తం 586 మంది చదువుకున్నట్లు తెలిపారు. ఇటీవల ఇళ్లకు వెళ్లి వచ్చిన నలుగురు విద్యార్థులకు కొవిడ్ పాజిటివ్ గా తేలడంతో మరికొంతమందికి కూడా టెస్టులు చేయించినట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే మొత్తం తొమ్మిదిమందికి పాజిటివ్ గా నిర్దారణ అయినట్లు ప్రిన్సిపల్ తెలిపారు. ఈ నేపథ్యంలో పాఠశాలలో చదివే అందరు విద్యార్థులకు టెస్టులు చేయించనున్నట్లు ప్రిన్సిపాల్ తెలిపారు. 

ఇక ఇదే జగిత్యాల జిల్లాలో ఓ ప్రైవేట్ స్కూల్ విద్యార్థి కూడా కరోనా బారినపడ్డాడు. జగిత్యాల పట్టణంలో ప్రైవేట్ స్కూల్లో చదివే విద్యార్థికి కరోనా టెస్ట్ చేయగా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. దీంతో ఆ స్కూల్లో చదివే విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. 

ఇలా వరుసగా స్కూళ్లలో కరోనా కేసులు బయటపడుతుండటంతో విద్యాశాఖతో పాటు వైద్యశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. విద్యార్థులు మాస్క్ ధరిస్తూ భౌతిక దూరం పాటించేలా చూడాలని ఉపాధ్యాయులకు విద్యాశాఖ ఆదేశించింది. స్కూళ్లలో టెస్టుల సంఖ్య పెంచి కరోనా వ్యాప్తిని అరికట్టే చర్యలను వైద్యశాఖ ప్రారంభించింది. 

read more  దేశంలో కొత్త‌గా ఎన్ని క‌రోనా కేసులు న‌మోదయ్యాయంటే..

ఇదిలావుంటే హైదరాబాద్ శివారులోని పటాన్ చెరు మండలం ముత్తంగి గురుకుల పాఠశాలలో కరోనా కలకలం రేగింది. 42 మంది విద్యార్థులు, ఒక ఉపాధ్యాయురాలు కరోనా బారినపడ్డారు. సంగారెడ్డి జిల్లా పరిధిలోని ఈ గురుకుల పాఠశాలలో 491మంది విద్యార్థులు, 27మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో 261 మంది విద్యార్థులు, 27 మంది సిబ్బందికి Corona testsలు నిర్వహించగా ఏకంగా 43 మందికి కోవిడ్ నిర్థారణ అయ్యింది. 

ఒమిక్రాన్ భయం వెంటాడుతున్న నేపథ్యంలో Corona positive వచ్చిన వారి నమూనాలను వైద్యాధికారులు Genome sequencing కు పంపారు. వసతి గృహంలోనే క్వారంటైన్ ఉంచి విద్యార్థులకు వైద్య సేవలు అందిస్తున్నారు. కరోనా బారిన పడిన విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యారోగ్య శాఖ తెలిపింది. 

పాఠశాలలో చదివే ఓ విద్యార్థి అస్వస్థతకు గురి కావడంతో వైద్య పరీక్షలు నిర్వహించగా కోవిడ్ నిర్థారణ అయ్యింది. దీంతో మరికొందరు విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహించగా ఏకంగా 43 మందికి పాజిటివ్ గా తేలింది. దీంతో పాఠశాలలో చదివే అందరు విద్యార్థులకు కరోనా టెస్టులు చేయిస్తున్నారు. 

 
 
 

 

Follow Us:
Download App:
  • android
  • ios