కాటికి కాలు చాపిన వయసులో అమ్మాయిలపై పిచ్చి  ఓ వృద్దుడి ప్రాణాలను బలితీసుకుంది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ కూకట్‌పల్లిలో నివసించే పత్తి రామదాసు కేంద్ర ప్రభుత్వ సంస్థలో పని చేస్తూ పదవి విరమణ చేశాడు. ఆయన భార్య గతేడాది జనవరిలో కన్నుమూసింది.

అయితే రామదాసుకు ఆ వయసులోనూ అమ్మాయిలపై మోజు ఉంది. ఒంటరిగా ఉన్న తనకు వృద్ధాప్యంలో ఆలనా పాలనా, ఇంటి పనులు చూసుకునేందుకు ఓ మహిళ తోడు కావాలని భావించాడు. ఈ క్రమంలో రామదాసుకున్న అమ్మాయిల పిచ్చిని తనుకు అనుకూలంగా మార్చుకోవాలనుకున్నాడు అతని ఇంట్లో పనిచేసే శ్రీరాములు.

దీనిలో భాగంగా నాగర్ కర్నూల్‌లో అమ్మాయి ఉందని చెప్పి చెప్పాడు. పథకం ప్రకారం అబిడ్స్‌లో ఉన్న జిల్లా కో-ఆపరేటివ్ బ్యాంక్ నుంచి రామదాసుతో రూ.2 లక్షలు డ్రా చేయించాడు. అనంతరం ఎంజీబీఎస్‌లో బస్సు ఎక్కి కల్వకుర్తికి చేరుకున్నారు.

అక్కడి నుంచి ఆటోలో నాగర్‌కర్నూలు రోడ్డులో ఉన్న సుద్దకల్ గ్రామంలోని బ్రిడ్జి కిందకు తీసుకెళ్లి మద్యం తాగించాడు. కొద్దిసేపటి తర్వాత వెనుక నుంచి వచ్చి రామదాసు తల, ముఖంపై గట్టిగా కొట్టడంతో చనిపోయాడు. అనంతరం రామదాసు వద్ద ఉన్న రూ. 2 లక్షలు తీసుకుని శ్రీరాములు హైదరాబాద్‌కు పారిపోయాడు.

అటుగా వెళ్తున్న స్థానికులు వృద్ధుడి మృతదేహం గురించి పోలీసులకు సమాచారం అందించడంతో అక్కడి చేరుకున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేశారు. విచారణలో భాగంగా రామదాసు సెల్‌ఫోన్ కాల్ డేటా కోసం ఆరా తీయగా శ్రీరాములు పేరు తెర మీదకు వచ్చింది.

అప్పటికే  శ్రీరాములు పేరు స్విచ్ఛాఫ్‌లో ఉండటంతో పోలీసులు అనుమానం బలపడింది. తాజాగా శ్రీరాములు తన కూతురు పెళ్లి వివాహ పత్రికలు పంచడానికి కల్వకుర్తికి రావడం.. సెల్‌ఫోన్ ఆన్ చేయడంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా, రామదాసును డబ్బు కోసం తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు.