తెలంగాణలో కొత్తగా 729 కరోనా కేసులు వెలుగుచూశాయి. 24 గంటల వ్యవధిలో వైరస్ బారినపడి ఐదుగురు మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 9,980 మంది చికిత్స పొందుతుండగా.. 772 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 1,15,515 కరోనా పరీక్షలు నిర్వహించగా కొత్తగా 729 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 71 కేసులు, కరీంనగర్ జిల్లాలో 65, మంచిర్యాల జిల్లాలో 53, పెద్దపల్లి జిల్లాలో 53, ఖమ్మం జిల్లాలో 52 కేసులు నమోదయ్యాయి. నారాయణపేట జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. అదే సమయంలో 772 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 24 గంటల వ్యవధిలో వైరస్ బారినపడి ఐదుగురు మరణించారు. తాజా కేసులతో కలిపి తెలంగాణలో ఇప్పటివరకు 6,36,049 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,22,313 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 9,980 మంది చికిత్స పొందుతున్నారు. తాజాగా మరణాలతో కలిపి ఇప్పటి వరకు తెలంగాణలో కోవిడ్ వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 3,756కి పెరిగింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే.. ఆదిలాబాద్ 3, భద్రాద్రి కొత్తగూడెం 23, జీహెచ్ఎంసీ 71, జగిత్యాల 22, జనగామ 6, జయశంకర్ భూపాలపల్లి 13, గద్వాల 5, కామారెడ్డి 3, కరీంనగర్ 65, ఖమ్మం 52, ఆసిఫాబాద్ 5, మహబూబ్‌నగర్ 6, మహబూబాబాద్ 13, మంచిర్యాల 53, మెదక్ 6, మేడ్చల్ మల్కాజిగిరి 25, ములుగు 13, నాగర్ కర్నూల్ 4, నల్గగొండ 45, నారాయణపేట 0, నిర్మల్ 4, నిజామాబాద్ 6, పెద్దపల్లి 53, సిరిసిల్ల 21, రంగారెడ్డి 26, సిద్దిపేట 17, సంగారెడ్డి 5, సూర్యాపేట 44, వికారాబాద్ 6, వనపర్తి 8, వరంగల్ రూరల్ 41, వరంగల్ అర్బన్ 47, యాదాద్రి భువనగిరిలో 18 చొప్పున కేసులు నమోదయ్యాయి. 

Scroll to load tweet…