వయసు 72.. మనసు పాతికేళ్లు.. గిన్నీస్ రికార్డు కోసం 1.70 లక్షల కి.మీ. బైక్ యాత్ర చేయనున్న సీనియర్ సిటిజన్..
72యేళ్ల సీనియర్ సిటిజన్ ఒకరు 1.70కి.మీ. ల బైక్ యాత్ర చేపట్టి అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు. హైదరాబాద్ కు చెందిన రమేష్ చంద్రబాబు ఈ యాత్రలో భాగంగా కామారెడ్డి చేరుకున్నారు.
కామారెడ్డి : కామారెడ్డికి చెందిన రమేష్ చంద్రబాబు అనే 72 ఏళ్ల వ్యక్తి హైదరాబాద్ కూకట్పల్లి పరిధిలోని మాధవినగర్ లో నివాసం ఉంటున్నాడు. గతంలో గుత్తేదారుగా పని చేశారు. గిన్నీస్ బుక్లో చోటు సంపాదించడమే లక్ష్యంగా 1.70 లక్షల కిలోమీటర్లు బైక్ యాత్రను అతను ఈ నెల 10న హైదరాబాద్లో ప్రారంభించారు. యాత్రలో భాగంగా సోమవారం కామారెడ్డికి చేరుకున్నారు. ‘సీనియర్ సిటిజన్లు అద్భుతాలు చేయగలరు’ అంటూ ద్విచక్రవాహనంపై రాయించుకుని దేశవ్యాప్త యాత్రకు శ్రీకారం చుట్టారు.
‘బెంగళూరుకు చెందిన ఓ కన్సల్టెన్సీ రూట్ మ్యాప్ తయారు చేసి ఇచ్చిందని.. రోజుకు సుమారు 250 కి.మీ. చొప్పున 700 రోజులపాటు యాత్ర సాగుతుందని... ఆదివారాలు, పండగ రోజుల్లో విశ్రాంతి తీసుకుంటానని రమేష్ చంద్ర చెప్పుకొచ్చారు. రెండేళ్ల కిందట ఈ ఆలోచన రావడంతో విశ్రాంత సైనికాధికారి భీమయ్య వద్ద ఆరు నెలలపాటు తగిన శిక్షణ పొందాను అన్నారు. హైదరాబాద్ నుంచి తిరుపతి, విజయవాడ, అరుణాచలం క్షేత్రాలకు ద్విచక్రవాహనంపై విజయవంతంగా వెళ్లి వచ్చాక, లభించిన ఆత్మవిశ్వాసంతో ఈ యాత్రకు సిద్ధమైనట్లు వెల్లడించారు.
స్పోర్ట్స్ డాక్టర్ దగ్గర వైద్య పరీక్షలు అన్ని చేయించుకొని.. ఆయన సూచనల మేరకు ప్రయాణం సాగిస్తున్నట్లు చెప్పారు. గతంలో ఉత్తరప్రదేశ్ వాసి ఇలా1.16 లక్షల కిలోమీటర్లు బైక్ పై ప్రయాణించారని, ఆ రికార్డును అధిగమిస్తామని రామచంద్రరావు విమర్శించారు.