తెలంగాణలో కొత్తగా 710 కరోనా కేసులు నమోదవ్వగా నలుగురు మరణించారు. 24 గంటల వ్యవధిలో 808 మంది కరోనా నుంచి కోలుకోగా.. 10,101 మంది చికిత్స పొందుతున్నారు

తెలంగాణలో కరోనా వైరస్ అదుపులోనే వుంది. గడిచిన 24 గంటల్లో 1,10,355 కరోనా పరీక్షలు నిర్వహించగా కొత్తగా 710 కరోనా పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. ఖమ్మం జిల్లాలో అత్యధికంగా 80 కొత్త కేసులు నమోదు కాగా, జీహెచ్ఎంసీ పరిధిలో 71 కేసులు గుర్తించారు. నిర్మల్, నారాయణపేట జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. 24 గంటల వ్యవధిలో 808 మంది కరోనా నుంచి కోలుకోగా, నలుగురు మరణించారు. తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు తెలంగాణలో మొత్తం 6,34,605 మంది కోవిడ్ బారినపడ్డారు. వైరస్ నుంచి 6,20,757 మంది కోలుకున్నారు. ప్రస్తుతం తెలంగాణలో 10,101 మంది చికిత్స పొందుతున్నారు. తాజా మరణాలతో కలిపి రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 3,747కి చేరుకుంది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే.. ఆదిలాబాద్ 1, భద్రాద్రి కొత్తగూడెం 32, జీహెచ్ఎంసీ 71, జగిత్యాల 19, జనగామ 6, జయశంకర్ భూపాలపల్లి 12, గద్వాల 3, కామారెడ్డి 3, కరీంనగర్ 34, ఖమ్మం 80, ఆసిఫాబాద్ 5, మహబూబ్‌నగర్ 9, మహబూబాబాద్ 21, మంచిర్యాల 47, మెదక్ 5, మేడ్చల్ మల్కాజిగిరి 26, ములుగు 14, నాగర్ కర్నూల్ 7, నల్గగొండ 52, నారాయణపేట 0, నిర్మల్ 0, నిజామాబాద్ 7, పెద్దపల్లి 46, సిరిసిల్ల 19, రంగారెడ్డి 29, సిద్దిపేట 25, సంగారెడ్డి 10, సూర్యాపేట 28, వికారాబాద్ 4, వనపర్తి 8, వరంగల్ రూరల్ 14, వరంగల్ అర్బన్ 51, యాదాద్రి భువనగిరిలో 22 చొప్పున కేసులు నమోదయ్యాయి. 

Scroll to load tweet…