మూడు రోజుల క్రితం అదృశ్యమైన యశ్వంత్ అనే కుర్రాడిని వరంగల్ బస్టాండ్ లో సోమవారం నాడు  వదిలివెళ్లారు. మూడు రోజుల క్రితం ఎంజీఎం ఆసుపత్రికి కొడుకుతో సహ తల్లి వచ్చింది. ఈ సమయంలో యశ్వంత్ కన్పించకుండా  పోయాడు. యశ్వంత్ కుటుంబసభ్యులు పోలీసులకు పిర్యాదు చేశారు.

మూడు రోజుల నుండి యశ్వంత్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. సోమవారం నాడు వరంగల్ బస్టాండ్ లో ఆ బాలుడిని వదిలి వెళ్లారు. యశ్వంత్ ను గుర్తు తెలియని వ్యక్తులు తీసుకెళ్లినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు.

అయితే యశ్వంత్ ను ఎవరు ఎందుకు తీసుకెళ్లారనే విషయమై స్పష్టత లేదు.ఈ విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు. మీడియాలో విస్తృతంగా ప్రచారం కావడం, పోలీసుల వేట కొనసాగుతున్న కారణంగా యశ్వంత్ ను వదిలి వెళ్లినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు.