మానసిక స్థితి సరిగాలేని యువతిని మాయమాటలతో మోసగించాడో వృద్ధుడు. తన కామవాంఛలు తీర్చుకుని.. ఆమె గర్భవతి కావడంతో తనకేం పాపం తెలియదంటూ వాపోతున్నాడు. వివరాల్లోకి వెడితే...
నల్గొండ : 65 ఏళ్ల వృద్ధుడు metal condition సరిగా లేని ఓ దళిత యువతికి మాయమాటలు చెప్పి శారీరకంగా లోబర్చుకుని pregnantని చేశాడు. ఈ ఘటన భూదాన్ పోచంపల్లి మండలంలోని మెహర్ నగర్ లో చోటు చేసుకుంది. బాధితురాలు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మానసిక స్థితి సరిగా లేని యువతి (25)కి తల్లిదండ్రులు మరణించారు. వివాహితులైన ఇద్దరు అక్కలు ఉన్నారు. కాగా, తల్లిదండ్రులు లేకపోవడంతో యువతి ఒంటరిగా ఉంటోంది.
ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన ఉప్పునూతల మల్లయ్య(65) ఒంటరిగా ఉంటున్న ఆ యువతికి మాయమాటలు చెప్పి శారీరకంగా లోబరుచుకున్నాడు. 15 రోజుల క్రితం యువతి రంగారెడ్డి జిల్లా అనాజ్పూర్ లో ఉంటున్న అక్క వద్దకు వెళ్ళింది. యువతి శరీర ఆకృతి అనుమానాస్పదంగా ఉండటంతో అక్కాబావ ఆమెకు వైద్య పరీక్షలు చేయించారు. పరీక్షల్లో ఆ యువతి ఏడు నెలల గర్భవతి అని తేలింది. దాంతో ఆ యువతి ప్రశ్నించగా మల్లయ్య తనను లోబర్చుకుని మోసం చేశాడని తెలిసింది.
ఈ విషయం బయటికి పొక్కడంతో సోమవారం గ్రామంలో పెద్దమనుషుల సమక్షంలో బాధితురాలికి పరిహారం ఇప్పించి రాజీకి యత్నించారు. కానీ, ఇరుపక్షాల మధ్య సయోధ్య కుదరలేదని సమాచారం. దాంతో సాయంత్రం బాధితురాలు నేరుగా పోలీస్ స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేసింది. వెంటనే చౌటుప్పల్ రూరల్ సీఐ వెంకటయ్య, ఎస్ఐ సైదిరెడ్డి గ్రామాన్ని సందర్శించి వాస్తవ విషయాలపై స్థానికులతో ఆరా తీసి విచారణ జరిపారు.
ఉప్పునూతల మల్లయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. అయితే ఇంత తతంగం జరిగితే.. ఉప్పునూతల మల్లయ్య మాత్రం తనకు ఎలాంటి పాపం తెలియదని.. అనవరంగా తనమీద ఆరోపణలు చేస్తున్నారని పేర్కొంటున్నాడు.
ఇదిలా ఉండగా,
ఆ బాలిక రోజులాగే పాల ప్యాకెట్ కోసం పాల బూత్ కి వెళ్ళింది. రాత్రి పూట అయినా.. ఆ మధ్యలోనే ఓ మద్యం దుకాణం ఉందని తెలిసినా.. రోజూ నడిచే దారే కదా అనే ధైర్యంతో వెళ్ళింది. కాని ఆరోజు మాత్రం ఘోరం జరిగిపోయింది. చిత్తుగా మద్యం తాగిన ఇద్దరు దుర్మార్గులు దారుణానికి ఒడిగట్టారు. బాలికను ఎత్తుకెళ్లి మరీ అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెద్దమ్మ నగర్ కాకతీయ సమీపంలో ఆదివారం రాత్రి జరిగింది.
జూబ్లీహిల్స్ పెద్దమ్మ నగర్ కు చెందిన బాలిక (15).. రాత్రివేళ పాల ప్యాకెట్ కోసం పీజేఆర్ గ్రౌండ్ సమీపంలోని ఓ మద్యం దుకాణం వద్ద ఉన్న పాల బూత్ కు వచ్చింది. తిరిగి ఇంటికి వెళ్లే క్రమంలో బోరబండ చెందిన శివ, మద్యం దుకాణం పక్కనే ఉంటున్న సాయిలు కంటపడింది. ఇద్దరూ అప్పుడే చిత్తుగా మద్యం తాగి దుకాణం నుంచి బయటకు వచ్చారు. బాలికను అడ్డగించారు. తమతో రావాలంటూ బలవంతపెట్టారు. అందుకు ఒప్పుకోక పోవడంతో.. ఆ దగ్గర్లోనే ఉన్న సాయిలు గదికి బలవంతంగా లాక్కెళ్ళి పోయారు.
అక్కడ.. ఆ ఇద్దరూ కలిసి అత్యాచారానికి పాల్పడ్డారు. తర్వాత ఎలాగో వారి నుంచి తప్పించుకున్న బాలిక ఇంటికి చేరుకుంది. తల్లిదండ్రులకు విషయం చెప్పి వారితో కలిసి ఎస్.ఆర్.నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితులపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు.
