Asianet News TeluguAsianet News Telugu

''65 శాతం అధికార పార్టీ ఎమ్మెల్యేల‌పై ప్ర‌జా వ్య‌తిరేక‌త‌.. ''

Hyderabad: తెలంగాణలో 65 శాతం భార‌త రాష్ట్ర స‌మితి (బీఆర్ఎస్) ఎమ్మెల్యేలపై ప్ర‌జా వ్య‌తిరేక‌త ఉంద‌ని బీజేపీ పేర్కొంది. రానున్న అసెంబ్లీ ఎన్నిక‌ల్లో రాష్ట్ర ప్ర‌జ‌లు బీఆర్ఎస్ అధినేత‌, సీఎం కేసీఆర్ కు త‌గిన గుణ‌పాఠం చెబుతార‌ని విమ‌ర్శించింది. కాగా, రాష్ట్ర ప‌ర్య‌ట‌న‌కు రానున్న ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ అక్టోబర్ 1న మహబూబ్ నగర్ లో బీజేపీ నిర్వహించే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.
 

65 Percent BRS MLAs facing anti-incumbency: Telangana BJP leader Marri Shashidhar Reddy RMA
Author
First Published Sep 28, 2023, 2:59 PM IST | Last Updated Sep 28, 2023, 2:59 PM IST

Telangana BJP: తెలంగాణలో 65 శాతం భార‌త రాష్ట్ర స‌మితి (బీఆర్ఎస్) ఎమ్మెల్యేలపై ప్ర‌జా వ్య‌తిరేక‌త ఉంద‌ని బీజేపీ పేర్కొంది. రానున్న అసెంబ్లీ ఎన్నిక‌ల్లో రాష్ట్ర ప్ర‌జ‌లు బీఆర్ఎస్ అధినేత‌, సీఎం కేసీఆర్ కు త‌గిన గుణ‌పాఠం చెబుతార‌ని విమ‌ర్శించింది. కాగా, రాష్ట్ర ప‌ర్య‌ట‌న‌కు రానున్న ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ అక్టోబర్ 1న మహబూబ్ నగర్ లో బీజేపీ నిర్వహించే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.

వివ‌రాల్లోకెళ్తే.. బీజేపీ నాయ‌కుడు మ‌ర్రి శ‌శిధ‌ర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ అధికార పార్టీపై ప‌లు విమ‌ర్శ‌లు గుప్పించారు. అధికార పార్టీకి చెందిన 65 శాతం మంది ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారనీ, రాబోయే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బీజేపీని అధికారంలోకి తీసుకువస్తారని అన్నారు. ఇటీవల నిర్వహించిన సర్వేలో కేసీఆర్ పై వ్యతిరేకత ఎక్కువగా ఉన్నట్లు తేలిందన్నారు. దీనికితోడు దాదాపు 65 శాతం మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందని పేర్కొన్నారు.

అధికార పార్టీ నేత‌లు ప్ర‌జ‌ల‌కు ఏం చేశారో చెప్పాల‌ని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజలను ఎలా మోసం చేశారో.. వారు ఎలాంటి అవినీతికి పాల్పడుతున్నారో అంద‌రికీ తెలుసున‌నీ, వారికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారన్నారు. ఈ అవినీతి పాల‌న‌ను అంతం చేయ‌డానికి ప్ర‌జ‌లు సిద్ధం కావాల‌నీ, త‌మ‌ను అధికారంలోకి తీసుకురావడానికి బీజేపీ ఓటు వేయాల‌ని విజ్ఙ‌ప్తి చేశారు.

అంత‌కుముందు తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ పై బీజేపీ అధికార ప్ర‌తినిధి ఎన్వీ సుభాష్ తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. ఎన్వీ సుభాష్ మాట్లాడుతూ.. ''గత తొమ్మిదేళ్లలో తెలంగాణకు కేసీఆర్, కేటీఆర్ ఏం చేశారు? ప్రధాని మోదీ రాష్ట్రానికి నిధులు ఇస్తున్నప్పుడు వాటిని దారి మళ్లించారు. అన్ని నిధులు మళ్లించబడ్డాయి, తద్వారా మీరు కొంత కిక్‌బ్యాక్ పొందార‌ని'' ఆరోపించారు. అలాగే, టీఎస్ పీఎస్సీ ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ లోపాల‌ను ఎత్తిచూపుతూ ప్రభుత్వంపై మండిప‌డ్డారు.  ''మీరు ఒక్క పరీక్ష కూడా నిర్వహించలేరు. రాష్ట్ర పీసీఎస్ ను 17 సార్లు వాయిదా వేశారు. రాష్ట్రంలోని 30 లక్షల మంది యువత ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. వారి జీవితాల‌ను చెల‌గాటం ఆడుతున్నారు. అలాగే, మీరు కేంద్రానికి అభివృద్ధి ప్రాజెక్టుల కోసం భూములు కేటాయించరు. దీని వల్ల రాష్ట్రంలోని చాలా ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉన్నాయి'' అని ఆయన అన్నారు.

ఈ ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు అక్టోబర్ 1న మహబూబ్‌నగర్‌లో బీజేపీ నిర్వహించనున్న బహిరంగ సభలో ప్రధాని మోడీ ప్రసంగించనున్నారు. ప్ర‌స్తుతం ప‌రిస్థితుల్లో తెలంగాణలో బీజేపీ, అధికార బీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్య ముక్కోణపు పోటీ నెలకొంది. కీలకమైన 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు తెలంగాణా ఎన్నికలు బీజేపీ నేతృత్వంలోని ఏన్డీయే కూట‌మితో పాటు ప్ర‌తిప‌క్షాల ఇండియా కూట‌మికి సైతం అగ్నిపరీక్షగా చెప్ప‌వ‌చ్చు. తెలంగాణ‌తో పాటు ఈ ఏడాది  మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మిజోరంల‌లో కూడా ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios