రాష్ట్రంలో 65 మంది ఐఎఎస్ అధికారులు బదిలీ అయ్యారు.


హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో భారీగా ఐఎఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. ఆదివారం నాడు అర్థరాత్రి ఐఎఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

జిల్లా కలెక్టర్లతో సహా అన్ని స్థాయిల్లో 65 మందికి స్థాన చలనం కలిగింది. సుమారు 50 మంది ఐఏఎస్‌లకు కొత్త పోస్టింగులు ఇచ్చింది. టాప్‌ లెవల్‌ నుంచి 2016 క్యాడర్‌ బ్యాచ్‌ వరకు బదిలీలు జరిగాయి.

బదిలీ అయిన ఐఏఎస్‌లకు కొత్తగా పోస్టింగ్‌లు కల్పించారు.బదిలీ అయిన ఐఏఎస్‌లలో మరికొంతమందికి పోస్టింగ్‌ ఇవ్వకుండా వెయిటింగ్‌లో ఉంచింది ప్రభుత్వం.
మహిళాశిశు సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శిగా ఉన్న ఎం జగదీశ్‌కు కీలక రెవెన్యూశాఖ కార్యదర్శి పదవి దక్కింది. ఎన్నికల సంఘం ప్రధానాధికారిగా ఉన్న రజత్‌కుమార్‌ను నీటిపారుదలశాఖ కమిషనర్‌గా ప్రభుత్వం నియమించింది. 

మహబూబ్‌నగర్‌ కలెక్టర్‌ ఉన్న రొనాల్డ్‌రోస్‌కు ఆర్థికశాఖ సెక్రటరీగా, అధర్‌సిన్హాకు పశుసంవర్థకశాఖ దక్కింది. సోమవారం మరికొన్ని బదిలీలు ఉండే అవకాశం ఉందని సమాచారం.ఇదిలా ఉండగా రాష్ట ఎన్నికల సంఘం ప్రధానాధికారి (సీఈవో)గా పనిచేస్తున్న రజత్‌కుమార్‌ ఇరిగేషన్‌శాఖ ముఖ్యకార్యదర్శి నియామకమైనందున ఆయన స్థానంలో మరొకరిని సీఈవోగా ప్రభుత్వం సూచించనుంది.

అధికారి పేరు ప్రస్తుత స్థానం బదిలీ స్థానం
1. చిత్రా రాంచంద్రన్‌ ప్రత్యేక ప్రధానకార్యదర్శి హౌజింగ్‌ ప్రత్యేక ప్రధానకార్యదర్శి విద్యాశాఖ 
2.ఆదార్‌సిన్హా ప్రత్యేక ప్రధానకార్యదర్శి సాధారణ పరిపాలన శాఖ పశుసంవర్థక, డెయిరీ డెవపల్‌మెంట్‌, మత్స్యశాఖ
3. రజత్‌కుమార్‌ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి నీటిపారుదలశాఖ ముఖ్యకార్యదర్శి 
4. ఎం.జగదీశ్వర్‌ మహిళ-శిశుసంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి 
5.సి.పార్థసారథి వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి ఈపీటీఆర్‌ఐ డైరెక్టర్‌ జనరల్‌ 
6. బి.వెంకటేశం సాంస్కృతిక, యువజనశాఖ కార్యదర్శి బీసీ సంక్షేమశాఖ కార్యదర్శి 
7.వికాస్‌రాజ్‌ ముఖ్యకార్యదర్శి పంచాయతీరాజ్‌గ్రామీణాభివృద్ది సాధారణ పరిపాలనశాఖ ముఖ్యకార్యదర్శి 
8. డాక్టర్‌ బి.జనార్థన్‌రెడ్డి విద్యాశాఖ కార్యదర్శి వ్యవసాయ, మార్కెటింగ్‌శాఖ కార్యదర్శి 
9. సందీప్‌కుమార్‌ సుల్తానియా సీఎం కార్యదర్శి పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ
10.రాహుల్‌ బొజ్జ వ్యవసాయశాఖ కమిషనర్‌ ఎస్సీసంక్షేమశాఖ సెక్రటరీ 
11. డాక్టర్‌ క్రిష్టీనా జెడ్‌.చంగ్తు గిరిజనశాఖ కమిషనర్‌ గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి 
12.డాక్టర్‌ టి.కె.శ్రీదేవి పురపాలకశశాఖ డైరెక్టర్‌ ఆర్థికశాఖ కార్యదర్శి 
13.కె.మాణిక్‌రాజ్‌ హైదరాబాద్‌ కలెక్టర్‌ పరిశ్రమలశాఖ కమిషనర్‌ 
14.డి.రోనాల్డ్‌రోస్‌ మహబూబ్‌నగర్‌ కలెక్టర్‌ ఫైనాన్స్‌శాఖ కార్యదర్శి 
15.రజత్‌కుమార్‌ షైనీ భధ్రాద్రి కొత్తగూడెం కలెక్టర్‌ ల్యాండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ సీసీఎల్‌ఏ డైరెక్టర్‌
16. డాక్టర్‌ ఎన్‌ సత్యనారాయణ కామారెడ్డి కలెక్టర్‌ పురపాలకశాఖ డైరెక్టర్‌
17. డీ దివ్య ఆదిలాబాద్‌ కలెక్టర్‌ స్త్రీ,శిశుసంక్షేమశాఖ సెక్రటరీ
18. అద్వైత్‌కుమార్‌సింగ్‌ జీహెచ్‌ఎంసీ అడిషనల్‌ కమిషనర్‌ ఎగ్జిక్యుటివ్‌ అసిస్టెంట్‌ చీఫ్‌ సెక్రటరీ
19. మహ్మద్‌ అబ్దుల్‌ అజీమ్‌ యువజనసర్వీసుల డైరెక్టర్‌ భూపాలపల్లి కలెక్టర్‌
20. డాక్టర్‌ ఏ శరత్‌ జగిత్యాల కలెక్టర్‌ కామారెడ్డి కలెక్టర్‌
21. పౌసుమీబసు సెర్ఫ్‌ సీఈవో వికారాబాద్‌ కలెక్టర్‌
22. డాక్టర్‌ ఎంవీ రెడ్డి మేడ్చల్‌ కలెక్టర్‌ భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్‌
23. ఏ శ్రీదేవసేన పెద్దపల్లి కలెక్టర్‌ ఆదిలాబాద్‌ కలెక్టర్‌
24. హరిచందన దాసరి జీహెచ్‌ఎంసీ అడిషనల్‌ కమిషనర్‌ నారాయణపేట కలెక్టర్‌
25. శ్వేతా మహంతి వనపర్తి కలెక్టర్‌ హైదరాబాద్‌ కలెక్టర్‌
26. ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ వరంగల్‌ అర్బన్‌ కలెక్టర్‌ నల్లగొండ కలెక్టర్‌
27. రాజీవ్‌గాంధీ హనుమంతు కుమ్రంభీం ఆసిఫాబాద్‌ కలెక్టర్‌ వరంగల్‌ అర్బన్‌ కలెక్టర్‌
28. శ్రుతి ఓజా జీహెచ్‌ఎంసీ అడిషనల్‌ కమిషనర్‌ జోగుళాంబ గద్వాల కలెక్టర్‌
29. టీ వినయ్‌కృష్ణారెడ్డి జనగామ కలెక్టర్‌ సూర్యాపేట కలెక్టర్‌
30. వీ వెంకటేశ్వర్లు జయశంకర్‌ భూపాలపల్లి కలెక్టర్‌ మేడ్చల్‌ మల్కాజిగిరి కలెక్టర్‌
31 సందీప్‌ కుమార్‌ ఝా జీహెచ్‌ఎంసీ అడిషనల్‌ కమిషనర్‌ కుమ్రం భీం ఆసిఫాబాద్‌ 
32 సిక్తా పట్నాయక్‌ జీహెచ్‌ఎంసీ అడిషనల్‌ కమిషనర్‌ పెద్దపల్లి కలెక్టర్‌
33 ముష్రఫ్‌ అలీ ఫరూఖీ జీహెచ్‌ఎంసీ అడిషనల్‌ కమిషనర్‌ నిర్మల్‌ కలెక్టర్‌
34 ఎస్‌ కృష్ణ ఆదిత్య ఐటీడీఏ ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌ ఉట్నూర్‌ ములుగు కలెక్టర్‌
35 వీపీ గౌతమ్‌ భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌ మహబూబాబాద్‌ కలెక్టర్‌
36 జీ రవి హైదరాబాద్‌ జేసీ జగిత్యాల కలెక్టర్‌
37 కే నిఖిల సంగారెడ్డి జేసీ జనగామ కలెక్టర్‌
39 ఎస్‌కే యాస్మిన్‌ బాషా రాజన్న సిరిసిల్ల జేసీ వనపర్తి కలెక్టర్‌
40 ఎస్‌ వెంకట్రావ్‌ నారాయణపేట కలెక్టర్‌ మహబూబ్‌నగర్‌ కలెక్టర్‌
41 గౌతమ్‌ పోట్రు మెట్‌పల్లి సబ్‌కలెక్టర్‌ భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి
42 రాహుల్‌ రాజ్‌ బెల్లంపల్లి సబ్‌కలెక్టర్‌ జీహెచ్‌ఎంసీ అడిషనల్‌ కమిషనర్‌
43 భవేశ్‌ మిశ్రా భద్రాచలం సబ్‌కలెక్టర్‌ ఉట్నూర్‌ ఐటీడీఏ ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌
44 జండేజ్‌ హన్మంత్‌ కుండిబా ఖమ్మం ప్రత్యేకాధికారి ఏటూరు నాగారం ఐటీడీఏ ప్రాజెక్ట్‌ అధికారి
45 వల్లూరి క్రాంతి మహబూబ్‌నగర్‌ స్పెషల్‌ ఆఫీసర్‌ కరీంనగర్‌ మున్సిపల్‌ కమిషనర్‌
46 పీ ఉదయ్‌కుమార్‌ జగిత్యాల స్పెషల్‌ ఆఫీసర్‌ రామగుండం మునిపల్‌ కమిషనర్‌
47 జితేశ్‌ వీ పాటిల్‌ సంగారెడ్డి స్పెషల్‌ ఆఫీసర్‌ నిజామాబాద్‌ మున్సిపల్‌ కమిషనర్‌
48 బీ గోపీ ఆదిలాబాద్‌ స్పెషల్‌ ఆఫీసర్‌ నిజాంపేట మున్సిపల్‌ కమిషనర్‌
49 బధావత్‌ సంతోష్‌ వరంగల్‌ రూరల్‌ స్పెషల్‌ ఆఫీసర్‌ జీహెచ్‌ఎంసీ అడిషనల్‌ కమిషనర్‌
49 ప్రియాంక ఆల యాదాద్రి భువనగిరి జిల్లా స్పెషల్‌ ఆఫీసర్‌ జీహెచ్‌ఎంసీ అడిషనల్‌ కమిషనర్‌
50 పీ ప్రావిణ్య కరీంనగర్‌ స్పెషల్‌ ఆఫీసర్‌ జీహెచ్‌ఎంసీ అడిషనల్‌ కమిషనర్‌