కొత్తగా 609 మందికి పాజిటివ్.. తెలంగాణలో 6,46,606కు చేరిన కేసుల సంఖ్య
తెలంగాణలో కొత్తగా 609 కరోనా కేసులు నమోదవ్వగా.. నలుగురు మృతి చెందారు. 647 మంది వైరస్ నుంచి కోలుకోగా.. తెలంగాణలో ప్రస్తుతం 8,777 యాక్టివ్ కేసులు వున్నాయి.
తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 1,08,921 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 609 కొత్త కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా బారినపడిన వారి సంఖ్య 6,46,606కు చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. 24 గంటల వ్యవధిలో నలుగురు వైరస్ వల్ల ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటివరకు తెలంగాణలో కోవిడ్ సోకి మృతి చెందిన వారి సంఖ్య 3,811కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 647 మంది కోలుకోవడం ద్వారా రాష్ట్రంలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 6,34,018కి చేరింది. ప్రస్తుతం తెలంగాణలో 8,777 యాక్టివ్ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.
ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే.. ఆదిలాబాద్ 1, భద్రాద్రి కొత్తగూడెం 19, జీహెచ్ఎంసీ 81, జగిత్యాల 25, జనగామ 8, జయశంకర్ భూపాలపల్లి 4, గద్వాల 0, కామారెడ్డి 3, కరీంనగర్ 67, ఖమ్మం 51, మహబూబ్‌నగర్ 6, ఆసిఫాబాద్ 4, మహబూబాబాద్ 10, మంచిర్యాల 14, మెదక్ 5, మేడ్చల్ మల్కాజిగిరి 36, ములుగు 4, నాగర్ కర్నూల్ 4, నల్గగొండ 48, నారాయణపేట 4, నిర్మల్ 3, నిజామాబాద్ 4, పెద్దపల్లి 39, సిరిసిల్ల 28, రంగారెడ్డి 36, సిద్దిపేట 11, సంగారెడ్డి 7, సూర్యాపేట 17, వికారాబాద్ 5, వనపర్తి 2, వరంగల్ రూరల్ 7, వరంగల్ అర్బన్ 41, యాదాద్రి భువనగిరిలో 15 చొప్పున కేసులు నమోదయ్యాయి.