హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని వైద్య కాలేజీ విద్యార్థులకు కరోనా సోకడం కలకలం రేపుతోంది. రాష్ట్రంలోని ప్రముఖ మెడికల్ కాలేజీ విద్యార్థులను క్వారంటైన్ కు తరలించారు. ఉస్మానియా, గాంధీ, నిమ్స్ వైద్య కాలేజీలకు చెందిన 600 మంది విద్యార్థులను క్వారంటైన్‌కి తరలించారు.

హైద్రాబాద్‌లోని మూడు వైద్య కాలేజీల్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కూడ రోజు రోజుకు కరోనా కేసులు కూడ పెరిగిపోతున్నాయి. ఉస్మానియా మెడికల్ కాలేజీ హాస్టల్ లో ఉన్న 280 మందిని క్వారంటైన్ చేశారు. గాంధీ కాలేజీలో 250 మంది విద్యార్థులను క్వారంటైన్ కు తరలించారు. గాంధీ కాలేజీలో 250 మంది విద్యార్థులను కూడ క్వారంటైన్ కు తరలించారు.నిమ్స్ మెడికల్ కాలేజీలో 95 మంది క్వారంటైన్ లో ఉన్నారు.

also read:నిమ్స్‌లో కరోనా కలకలం: నలుగురు వైద్యులు, ముగ్గురు ల్యాబ్ సిబ్బందికి కరోనా

పెద్ద సంఖ్యలో మెడికల్ కాలేజీ విద్యార్థులకు కరోనా సోకడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఉస్మానియా మెడికల్ కాలేజీ విద్యార్థులు తప్పనిసరిగా పీపీఈ కిట్స్ ను ఉపయోగించాలని కాలేజీ ప్రిన్సిపాల్ ఆదేశించింది.

కరోనా వ్యాప్తి చెందుతుండడంతో జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రోగులకు సేవ చేసే వైద్యులకు కూడ కరోనా సోకుతుండడంతో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది.

జూన్, జూలై మాసాల్లో భారత్ లో కరోనా కేసులు మరింతగా పెరిగే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించిన విషయం తెలిసిందే. గత పక్షం రోజులుగా దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కూడ కరోనా కేసులు పెరుగుతున్నాయి.