మహబూబాబాద్ జిల్లా శనిగపురం శివారులో కోతుల మృతదేహాలు గుట్టగా బయటపడ్డాయి. రాత్రి గుర్తు తెలియని దుండగులు కోతుల మృతదేహాలను ఇక్కడ పడేయగా పొద్దునే గుర్తించిన స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. 

దీంతో వెంటనే అక్కడికి చేరుకున్న అధికారులు కోతుల మృతదేహాలను పరిశీలించారు. ఈ కోతులన్నీ విష ప్రయోగం తో మృతి చెందినట్లు అనుమానిస్తున్నారు. దాదాపు 60 కోతులను బస్తాల్లో నింపి ఇక్కడకు తీసుకువచ్చి పొదల్లో వదిలి వెళ్ళి వుంటారని అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై విచారణ చేస్తున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు.