తెలంగాణలో కొత్తగా 582 కరోనా కేసులు నమోదవ్వగా.. ముగ్గురు మృతి చెందారు.  638 మంది వైరస్ నుంచి కోలుకోగా.. తెలంగాణలో ప్రస్తుతం 8,744 యాక్టివ్‌ కేసులు వున్నాయి. 

తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 1,07,329 కరోనా పరీక్షలు నిర్వహించగా కొత్తగా 582 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 83 కేసులు నమోదయ్యాయి. వరంగల్ అర్బన్ జిల్లాలో 61, కరీంనగర్ జిల్లాలో 61 కేసులు వెల్లడయ్యాయి. ఖమ్మం జిల్లాలో 45 కేసులు గుర్తించారు. కామారెడ్డి, నారాయణపేట జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. 24 గంటల్లో 638 మంది కరోనా నుంచి కోలుకోగా, ముగ్గురు మరణించారు. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 6,47,811కి చేరింది. అలాగే 6,35,250 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం తెలంగాణలో 8,744 మంది చికిత్స పొందుతున్నారు. తాజా మరణాలతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 3,817కి చేరింది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే.. ఆదిలాబాద్ 3, భద్రాద్రి కొత్తగూడెం 12, జీహెచ్ఎంసీ 83, జగిత్యాల 24, జనగామ 8, జయశంకర్ భూపాలపల్లి 6, గద్వాల 1, కామారెడ్డి 0, కరీంనగర్ 61, ఖమ్మం 45, మహబూబ్‌నగర్ 5, ఆసిఫాబాద్ 4, మహబూబాబాద్ 11, మంచిర్యాల 17, మెదక్ 6, మేడ్చల్ మల్కాజిగిరి 27, ములుగు 7, నాగర్ కర్నూల్ 4, నల్గగొండ 39, నారాయణపేట 0, నిర్మల్ 4, నిజామాబాద్ 5, పెద్దపల్లి 22, సిరిసిల్ల 17, రంగారెడ్డి 26, సిద్దిపేట 18, సంగారెడ్డి 9, సూర్యాపేట 26, వికారాబాద్ 2, వనపర్తి 6, వరంగల్ రూరల్ 7, వరంగల్ అర్బన్ 61, యాదాద్రి భువనగిరిలో 16 చొప్పున కేసులు నమోదయ్యాయి.

Scroll to load tweet…