కరీంనగర్: మనవడు, మనవరాళ్లతో ఆడుకోవాల్సిన వయస్సులో ఇద్దరు కవలలకు జన్మినిచ్చింది 52ఏళ్ల మహిళ. ఈ ఘటన కరీనంగర్ జిల్లాలో చోటు చేసుకుంది. శుక్రవారం నాడు ఇద్దరు ఆడశిశువులకు ఆ మహిళ జన్మనివ్వడంతో కుటుంబ సభ్యులు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. 

వివరాల్లోకి వెళ్తే భద్రాచలంకు చెందిన 52ఏళ్ల రమాదేవి అనే మహిళకు ఒక కుమారుడు ఉన్నాడు. చేతికందివచ్చిన సమయానికి రోడ్డు ప్రమాదంలో మరణించాడు. కొడుకు మరణంతో తీవ్ర విషాదంలో చేరుకున్న ఆ కుటుంబం సంతానం కావాలనుకున్నారు. 

వయసు ఎక్కువ కావడంతో ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించారు ఆ దంపతులు. కరీంనగర్‌లోని పద్మజా సంతాన సాఫల్య కేంద్రంలోని వైద్యురాలు పద్మజను సంప్రదించారు. తమకు జరిగిన ఘోరాన్ని తెలిపారు. అలాగే తమ మనసులోని కోరికను కూడా స్పష్టం చేశారు. 

రమావదేవికి వైద్యురాలు పద్మజ ఐవీఎఫ్ విధానం ద్వారా గర్భం కోసం ప్రయత్నించి సఫలీకృతమయ్యారు. దాంతో నెలలు నిండతంతో రమాదేవి శుక్రవారం ఇద్దరు ఆడశిశువులకు జన్మనిచ్చింది. 

ఒకే కాన్పులో ఇద్దరు ఆడశిశువులకు రమాదేవి జన్మనివ్వడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఈ సందర్భంగా ఆ దంపతులు వైద్యురాలికి కృతజ్ఞతలు తెలిపారు రమాదేవి దంపతులు.