Asianet News TeluguAsianet News Telugu

ప్రయాణికులకు శుభవార్త.. నగరంలో 50శాతం సిటీ బస్సులు

లాక్​డౌన్​ తర్వాత బస్సులను ప్రారంభించినప్పుడు ఆర్టీసీ సంస్థ గ్రేటర్​లో సుమారు 800 సర్వీసులు మాత్రమే తిప్పింది. ఓఆర్ తక్కువగా వచ్చినప్పటికీ… కరోనాను కట్టడిలో భాగంగా తక్కువ బస్సులు తిప్పింది.

50 percent City Buses will run in Hyderabad today onwards
Author
Hyderabad, First Published Nov 17, 2020, 12:26 PM IST

కరోనా మహమ్మారి నేపథ్యంలో దేశంలో లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ లాక్ డౌన్ అప్పటి నుంచి దేశవ్యాప్తంగా రవాణా స్తంభించిపోయింది. విడతల వారీగా లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత.. అడపాదడపా ప్రజా ప్రయాణానికి వెసులుబాటు అవుతోంది. అయితే.. పూర్తి స్థాయిలో రవాణా మాత్రం సాధ్యపడటం లేదు. కాగా.. తాజాగా.. ఈ విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈ రోజు నుంచి 50శాతం బస్సులను నపడనున్నట్లు చెప్పారు.

లాక్​డౌన్ తర్వాత ప్రజా రవాణాకు కేంద్రం పూర్తి స్థాయిలో పర్మిషన్ ఇచ్చినప్పటికీ… గ్రేటర్ పరిధిలో 25శాతం బస్సులు మాత్రమే నడిపిస్తోంది. వైరస్ కట్టడి చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. అయితే కేసుల సంఖ్య ఇప్పుడు గణనీయంగా తగ్గింది. ఈ క్రమంలో  బస్సుల సంఖ్యను పెంచాలని సీఎం కేసీఆర్ ఆర్టీసీ ఎండీకి సూచించారు. దీంతో నగరంలోని అన్ని రూట్లలో ఆర్టీసీ బస్సులను తిప్పుతున్నామని అధికారులు వెల్లడించారు.

ప్రస్తుతం ఆర్టీసీకి గ్రేటర్ లో 45శాతం ఆక్యుపెన్సీ రేటు (ఓఆర్) వస్తుందని… రోజుకు సుమారు రూ.1.5 కోట్ల ఆదాయం సమకూరుతుందని తెలిపారు. ఆదివారం, సెలవు రోజుల్లో ఆదాయం రూ.90 లక్షల వరకు పడిపోతుందని…మిగితా రోజుల్లో బాగానే ఉంటుందని ఆర్టీసీ అధికారులు వివరించారు . ప్రస్తుతం 1,700ల బస్సులను గ్రేటర్​లో తిప్పుతున్నామని… దాదాపు అన్ని రూట్లలో బస్సులు తిరిగే విధంగా చూస్తున్నామన్నారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సులను ఆయా రూట్లలో తిప్పుతున్నామని గ్రేటర్ ఆర్టీసీ ఈడీ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.

లాక్​డౌన్​ తర్వాత బస్సులను ప్రారంభించినప్పుడు ఆర్టీసీ సంస్థ గ్రేటర్​లో సుమారు 800 సర్వీసులు మాత్రమే తిప్పింది. ఓఆర్ తక్కువగా వచ్చినప్పటికీ… కరోనాను కట్టడిలో భాగంగా తక్కువ బస్సులు తిప్పింది. లాక్​డౌన్ తర్వాత గ్రేటర్​లో ప్రజా రవాణా ప్రారంభమైనప్పటికీ… సొంత వాహనాలకే ప్రజలు ప్రాధాన్యమిచ్చారు. ప్రజా రవాణాపై అంతగా ఆసక్తి కనబరచకపోవడం వల్ల ఆర్టీసీకి ప్రారంభంలో అతి తక్కువ ఆదాయం వచ్చింది.

Follow Us:
Download App:
  • android
  • ios