దుబ్బాక:మంత్రి హరీష్ రావు కు ప్రజలు 50 లక్షల జరిమానా విధించారు. అవును మీరు చదివింది నిజమే! తెలంగాణ ఆర్ధిక మంత్రి హరీష్ రావు గారికి దుబ్బాక మహిళలు ఈ జరిమానా విధించారు. 

Also read: హరీష్ రావ్ రికార్డును బద్దలుకొట్టిన జెనీలియా బావ

వివరాల్లోకెళితే, మంత్రి హరీష్ రావు మహిళలకు మెప్మా రుణాలు, చెత్త బుట్టల పంపిణీ కోసం ఉదయం 11.30కు సిద్ధిపేట జిల్లా దుబ్బాకలో సభకు హాజరవ్వాల్సి ఉంది. కానీ హరీష్ రావు ఆ సభకు ఆలస్యంగా వచ్చారు. 

హరీష్ రావు 11 గంటలకు రావాల్సి ఉండగా ఆయన రావడం దాదాపుగా నాలుగు గంటల ఆలస్యమయింది. హరీష్ దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డితోని కలిసి సభా వేదికను చేరుకునే సరికి మధ్యాహ్న 3.30 దాటిపోయింది. 

Also read: పవార్ మేనల్లుడి దెబ్బకు హరీష్ రావు రికార్డు గల్లంతు

సభకు రావాల్సిన సమయం కన్నా ఆలస్యంగా వచ్చినందుకు ప్రజలను క్షమాపణలు కోరారు. అప్పటిదాకా వారందరిని వెయిట్ చేయించినందుకు క్షమించాలని కోరారు. ఇలా వెయిట్ చేయించినందుకు తనకు జరిమానా విధించాలన్నారు. 

అక్కడ సభలో ఉన్న ప్రజలు తమకు మహిళా భావన నిర్మాణానికి నిధులను మంజూరు చేయమని కోరారు. ప్రజల కోరికను మన్నించిన హరీష్ వెంటనే దానికి ఓకే చెప్పారు. మహిళా భవన నిర్మాణానికి 50 లక్షలు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చాడు. వెంటనే దానికి సంబంధించిన అధికారులతో ఫోన్లో మాట్లాడి నిధులను మంజూరు చేయాలనీ ఆదేశించాడు. 

Also read: ఆర్టీసీ సమ్మె, సింగరేణి ఇష్యూ: హరీష్ రావు, కవితల ఎఫెక్ట్

మొత్తానికి హరీష్ రావు ఆలస్యంగా రావడం ప్రజలకు ఎంతో మేలు చేకూర్చింది. ప్రజలను క్షమించమని కోరి జరిమానా విధించామని అడగగానే ప్రజలు విధించడం, హరీష్ రావు దానికి అంగీకరించి జరిమానా కట్టడం అక్కడ సభలో చర్చనీయాంశంగా మారింది. 

ఆర్టీసీ సమ్మె మొదలయ్యి నాలుగు వారాలవుతున్నా, హరీష్ రావు ఏమీ స్పందించకపోవడం పై పలువురు మంది పడుతున్నారు. ఒక వారం రోజుల కింద మంద కృష్ణ మాదిగ పదవి రాగానే మామ పంచన చేరవంతు తీవ్రమైన వ్యాఖ్యలు చేసాడు. 

ప్రతి విషయంపై స్పందించే హరీష్ రావు... ఆర్టీసీ సమ్మెపై మాత్రం ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు. ప్రస్తుతం తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు గత 28 రోజులుగా సమ్మె చేపడుతున్న సంగతి తెలిసిందే. కాగా... తమ డిమాండ్లు నెరవేర్చేంత వరకు సమ్మె విరమింప చేయమని వారు చెబుతున్నారు. కాగా.. కార్మికులు సమ్మె చేపట్టి ఇన్ని రోజులు అవుతున్నా... దీనిపై మంత్రి హరీష్ రావు ఇంతవరకు ఒక్కసారి కూడా స్పందించలేదు. దీంతో.... మందకృష్ణ మాదిగ ఈ విషయంపై ఇలాంటి తీవ్ర వ్యాఖ్యలు చేసారు.