తెలంగాణలో వరుసగా చిన్నారుల అదృశ్యం కేసులు కలకలం రేపుతున్నాయి. తాజాగా సూర్యాపేటలో బాలుడు అదృశ్యమయ్యాడు. వివరాల్లోకి వెలితే.. భగత్‌సింగ్‌ నగర్‌ కాలనీకి చెందిన పరికపల్లి మహేశ్‌-నాగలక్ష్మిల కుమారుడు గౌతమ్‌ (5) నిన్న రాత్రి నుంచి కనిపించడం లేదు

తెలంగాణలో వరుసగా చిన్నారుల అదృశ్యం కేసులు కలకలం రేపుతున్నాయి. తాజాగా సూర్యాపేటలో బాలుడు అదృశ్యమయ్యాడు. వివరాల్లోకి వెలితే.. భగత్‌సింగ్‌ నగర్‌ కాలనీకి చెందిన పరికపల్లి మహేశ్‌-నాగలక్ష్మిల కుమారుడు గౌతమ్‌ (5) నిన్న రాత్రి నుంచి కనిపించడం లేదు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

రాత్రి 8 గంటల సమయంలో టపాసుల కోసం దుకాణానికి వెళ్లిన బాలుడు తిరిగి రాలేదు. దీంతో అర్ధరాత్రి వరకు వెతికిన తల్లిదండ్రులు.. చివరకు పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన ఉన్నతాధికారులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.

సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా గౌతమ్‌ కోసం గాలిస్తున్నాయి. ఆత్మకూరు మండలం ఏపూర్‌కు చెందిన మహేశ్‌ లారీ డ్రైవర్‌గా పనిచేస్తూ సూర్యాపేటలో నివాసముంటున్నాడు. ఇటీవల మహబూబాబాద్‌లో బాలుడి అదృశ్యం విషాదాంతమైన నేపథ్యంలో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.