మూతపడుతున్న దుకాణాలు: జనరల్ బజార్, బేగం బజార్, రాణిగంజ్ మూత

జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో వాణిజ్య దుకాణాలు వరుసగా మూతపడుతున్నాయి. తాజాగా రాణిగంజ్ లో 5 వేల దుకాణాలను స్వచ్ఛంధంగా మూసివేయనున్నారు.

5 thousand shops will be shut down from june 28 in ranigunj


హైదరాబాద్: జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో వాణిజ్య దుకాణాలు వరుసగా మూతపడుతున్నాయి. తాజాగా రాణిగంజ్ లో 5 వేల దుకాణాలను స్వచ్ఛంధంగా మూసివేయనున్నారు.

సికింద్రాబాద్ పరిధిలోని జనరల్ బజార్ ను ఈ నెల 28వ తేదీ నుండి వచ్చే నెల 5వ తేదీ వరకు వ్యాపారులు నిర్ణయం తీసుకొన్నారు. మరో వైపు ఈ నెల 28వ తేదీ నుండి వారం రోజుల పాటు బేగం బజార్ ను మూసివేయాలని  నిర్ణయం తీసుకొన్నారు.

also read:కరోనా దెబ్బ: నిన్న జనరల్ బజార్, నేడు బేగం బజార్ మూసివేత

తాజాగా రాణిగంజ్ లో ని ఐదువేల దుకాణాలు కూడ మూసివేయాలని నిర్ణయం తీసుకొన్నారు. ఈ నెల 28వ తేదీ నుండి వారం రోజుల పాటు ఈ దుకాణాలు మూతవేయనున్నట్టు వ్యాపారులు ప్రకటించారు. 

లాక్ డౌన్ ఆంక్షలు ఎత్తివేసిన తర్వాత రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. వాణిజ్య సముదాయాలు తెరుచుకొన్నా ఆశించిన వ్యాపారాలు సాగడం లేదు. పైగా కరోనా సోకుతోందనే భయం వ్యాపారుల్లో నెలకొంది.

తెలంగాణ రాష్ట్రంలో  రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. గురువారం నాటికి రాష్ట్రంలో కరోనా కేసులు 11, 364కి చేరుకొన్నాయి. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios