పథకం పేరును అన్నపూర్ణగా మార్చినట్లు ప్రకటించిన కేటీఆర్
జీహెచ్ఎంసీ ప్రవేశపెట్టిన రూ.5 భోజనం జంటనగరాల పరిధిలో సూపర్ హిట్ అయింది. ముఖ్యంగా కూలీలు, పేదలకు ఈ భోజన పథకం అన్నపూర్ణ అని చెప్పకతప్పదు.
ఇప్పటికే జీహెచ్ఎంసీ పరిధిలో 109 చోట్ల ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. త్వరలో వరంగల్ లో కూడా ఏర్పాటు చేస్తామని కడియం శ్రీహరి ప్రకటించారు.
ఈ పథకం అసెంబ్లీలో మంత్రి కేటీఆర్ ఈ రోజు మాట్లాడుతూ..ఈ భోజన కేంద్రాలను 109 నుంచి 150 కి పెంచుతామని ప్రకటించారు.
అలాగే రూ. 5 భోజన పథకాన్ని ఇకపై అన్నపూర్ణ భోజన కేంద్రంగా పేరు మారుస్తున్నట్లు ప్రకటించారు.
అయిదు రూపాయల భోజనం నాణ్యంగా ఉన్నదని ఇప్పటికే ప్రతిపక్ష నేత జానారెడ్డితో సహా పలువురు కితాబిచ్చారని గుర్తు చేశారు.
ఆస్పత్రులు, లేబర్ అడ్డాల్లో ఈ కేంద్రాలను శాశ్వతంగా ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. భోజన కేంద్రాల వద్ద త్రాగునీరు కూడా అందుబాటులోకి తెస్తామన్నారు.
