తెలంగాణలో కోవిడ్ తీవ్రత... కొత్తగా 4,723 మందికి పాజిటివ్, పెరుగుతున్న రికవరీలు
తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 4,723 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 5,11,711 కి చేరింది.
తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 4,723 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 5,11,711 కి చేరింది.
వీరిలో 4,49,744 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం తెలంగాణలో 59,113 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక రాష్ట్రంలో కరోనాతో 31 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 2,834 కి చేరింది. ఈ ఒక్కరోజు రాష్ట్రంలో 5695 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.
కాగా, ఫస్ట్‌వేవ్ తర్వాత రాష్ట్రంలో మౌలిక వసతులు పెంచామన్నారు మంత్రి హరీశ్ రావు. బుధవారం కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్థన్‌తో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ.. ఐసీయూ బెడ్లను 3 వేల నుంచి 11 వేలకు పెంచామని హరీశ్ రావు వెల్లడించారు.
Also Read:ఏపీ, కర్ణాటక నుంచి రోగులు.. తెలంగాణకు భారం: హరీశ్ సంచలన వ్యాఖ్యలు
కరోనా నియంత్రణకు ఫీవర్ సర్వేను నిర్వహిస్తున్నామని.. మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ నుంచి కరోనా రోగులు చికిత్స నిమిత్తం తెలంగాణ వస్తుండటంతో లెక్కల్లో తేడా వస్తోందని మంత్రి చెప్పారు. ఇది తెలంగాణకు తలకుమించిన భారంగా మారిందని హరీశ్ రావు తెలిపారు.
తెలంగాణకు వలస వచ్చిన వారి పాజిటివ్ కేసులను కూడా పరిగణనలోనికి తీసుకోవాలని మంత్రి సూచించారు. ఆక్సిజన్ సరఫరాను 450 నుంచి 650 మెట్రిక్ టన్నులకు పెంచాలని హరీశ్ రావు ఆదేశించారు. రెమిడిసివర్ ఇంజెక్షన్లను రోజుకు 20 వేలు కేటాయించాలని ఆయన కేంద్రానికి విజ్ఙప్తి చేశారు. టోసిలిజుమాబ్ మందులను రోజుకు 1500కు పెంచాలని హరీశ్ రావు కోరారు