హైదరాబాద్: రాష్ట్రంలోని ఖమ్మం, వరంగల్ కార్పోరేషన్లతో పాటు మరో ఐదు మున్సిపాలిటీలకు శుక్రవారం నాడు పోలింగ్ జరుగుతోంది.ఆయా ప్రాంతాల్లో ప్రముఖులు  ఓటేశారు. అంతేకాదు ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఖమ్మం, వరంగల్ కార్పోరేషన్లతో పాటు. అచ్చంపేట, సిద్దిపేట, జడ్చర్ల, నకిరేకల్ కొత్తూరు మున్సిపాలిటీలకు ఇవాళ పోలింగ్ జరుగుతోంది. ఇవాళ ఉదయం 11 గంటలవరకు వరంగల్ లో 11.2 ఖమ్మం కార్పోరేషన్ లో 23.41శాతం, నకిరేకల్ మున్సిపాలిటీలో 45.5 శాతం,అచ్చంపేటలో 34 శాతం, జడ్చర్లలో 35 శాతం, సిద్దిపేటలో 31శాతం,కొత్తూరు లో 44 శాతం పోలింగ్ నమోదైంది.

also read:కొనసాగుతున్న తెలంగాణ మున్సిపల్ ఎన్నికల పోలింగ్

వరంగల్ కార్పోరేషన్ ఎన్నికల్లో  మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి దంపతులు తమ ఓటు హక్కును వినియోగించుకొన్నారు. ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, అచ్చంపేటలో ఎంపీ, ఎమ్మెల్యేలు రాములు, గువ్వల బాలరాజులు ఓటేశారు.ఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ దంపతులు ఓటు వేశారు. రెండు కార్పోరేషన్లు, ఐదు  మున్సిపాలిటీల్లో  విజయం సాధించేందుకు  ప్రధాన పార్టీలు తమ శక్తియుక్తులను వినియోగించాయి.  ఖమ్మం కార్పోరేషన్ లో  టీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ నెలకొంది. టీఆర్ఎస్ నేతలు దొంగ ఓట్లు  వేస్తున్నారని బీజేపీ ఆరోపించింది.