కన్నకూతుళ్లను అల్లారుముద్దుగా చూసుకోవాల్సిన తండ్రులే వారి పాలిట కీచకులుగా మారుతున్నారు. తమ కామవాంఛకు వావివరసలు వదిలేసి పశువుల్లా ప్రవర్తిస్తున్నారు. దేశవ్యాప్తంగా రోజూ ఇలాంటి కేసులు అనేకం వెలుగు చూస్తున్నాయి. తాజాగా హైదరాబాద్ బంజారాహిల్స్ లో ఓ తండ్రి తన ఇద్దరు కూతుళ్లపై లైంగిక దాడి చేసిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. 

కన్నతండ్రి కూతురిపై మూడేళ్లుగా లైంగికదాడికి పాల్పడుతూ ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బెదిరించసాగాడు. ఈ విషయం తెలుసుకున్న బాధితురాలి సోదరి బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. 

వివరాల్లోకి వెళితే.. బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌-12లోని బోలానగర్‌ ఫస్ట్‌లాన్సర్‌లో నివసించే విద్యార్థిని(18)పై ఆమె తండ్రి(42) గత కొంతకాలంగా ఇంట్లో ఎవరూ లేని సమయంలో లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. అతడి వేధింపులు తాళలేక బాధితురాలు గత డిసెంబర్‌ 29న ఇంట్లో నుంచి వెళ్లిపోయింది.

కుటుంబసభ్యులు అంతటా వెతికి జనవరి 5న ఆమెను ఇంటికి తీసుకొచ్చారు. వచ్చిన తర్వాత ఇంట్లో నుంచి ఎందుకు వెళ్లిపోయావని సోదరి నిలదీయడంతో మహ్మద్‌ కరీం అనే వ్యక్తి తనను తీసుకెళ్లాడని.. రెండుసార్లు లైంగిక దాడికి పాల్పడినట్లు చెప్పింది. అంతేగాక తండ్రి కూడా పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని తెలిపింది. 

మూడేళ్లుగా తన సోదరిపై లైంగిక దాడికి పాల్పడుతున్నాడని, తనపై కూడా పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని ఇద్దరం తండ్రి బాధితులమేనని ఫిర్యాదులో పేర్కొంది. పోలీసులు  కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.