వలస కూలీల దెబ్బ: తెలంగాణలో మరో 41 కేసులు నమోదు
తెలంగాణలో సోమవారంనాడు కొత్తగా 41 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జిహెచ్ఎంసి పరిధిలోనే ఎక్కువ కేసులు నమోదయ్యాయి. మరణాలు మాత్రం చాలా వరకు ఆగిపోయాయి.
హైదరాబాద్: తెలంగాణపై వలస కూలీల దెబ్బ పడుతోంది. తెలంగాణలో సోమవారం కొత్త గా 41 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. దీతో తెలంగాణలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 1,592కు చేరుకుంది. 12 మంది వలస కూలీలకు కరోనా వైరస్ పాజిటివల్ నిర్ధారణ అయింది.
సోమవారంనాడు గ్రేటర్ హైదరాాబద్ నగర పాలక సంస్థ (జీహెచ్ఎంసీ) పరిధఇలో 26 మందికి కరోనా వైరస్ సోకింది. మేడ్చల్ జిల్లాలో ముగ్గురికి కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ అయింది. తెలంగాణలో ఇప్పటి వరకు 69 మంది వలస కూలీలకు కరోనా వైరస్ సోకినట్లు తేలింది.
సోమవారంనాడు 10 మంది కోవిడ్ -19 నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జీ అయ్యారు. ఇప్పటి వరకు మొత్తం 1,002 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జీ అయ్యారు. 556 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. తెలంగాణలో కరోనా వైరస్ తో ఇప్పటి వరకు 34 మంది మరణించారు.
గత 14 రోజులుగా ఒక్క కేసు కూడా నమోదు కాని జిల్లాలు రాష్ట్రంలో 25 ఉన్నాయి. ఇప్పటి వరకు డిశ్చార్జీ అయినవారిలో 61 నుంచి 70 ఏళ్ల మధ్య వయస్సు గలవారు 60 మంది ఉన్నారు. 71 నుంచి 80 ఏళ్ల మధ్య వయస్సు గలవారు 15 మంది ఉన్నారు. పురుషులు 663 మంది, మహిళలు 339 మంది ఉన్నారు.