సిద్ధిపేట: తెలంగాణలోని సిద్ధిపేటలో దిగ్భ్రాంతికరమైన సంఘటన చోటు చేసుకుంది. సిద్ధిపేట మున్సిపల్ కార్పోరేషన్ సిబ్బంది 40 ఊర కుక్కలను చంపేసి, పాతిపెట్టారు. ఈ విషయాన్ని మున్సిపల్ కమిషరన్ జోయెల్ డేవిస్ ధ్రువీకరించారు. 

సంఘటనకు బాధ్యులైనవారిపై సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు ఆయన చెప్పారు. శునకాల శవాలను స్వాధీనం చేసుకోవాల్సి ఉందని చెప్పారు. తదుపరి విచారణ కొనసాగుతోందని చెప్ాపరు. 

ఈ సంఘటన సిద్ధిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామా రెడ్డి తీవ్రంగా స్పందించారు. సంఘటనకు బాధ్యులైన నలుగురు ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ ఆయన ఆదేశాలు జారీ చేశారు.