సికింద్రాబాద్‌లో విషాదం చోటు చేసుకుంది. సీతాఫల్‌మండిలో పురాతన భవంతి స్లాబ్ కూలి ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. వీరిని హుటాహుటిన గాంధీ ఆసుపత్రికి తరలించారు స్థానికులు. అక్కడ చికిత్స పొందుతూ నాలుగేళ్ల చిన్నారి మరణించాడు.

సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు ఘటనా స్థలికి చేరుకుని.. శిథిలాల కింద ఎవరైనా చిక్కుకున్నారన్న కోణంలో వారు శిథిలాల తొలగింపు ప్రక్రియను చేపట్టారు. మరిన్ని వివరాలు అందాల్సి వుంది.