తెలంగాణ ప్రభుత్వం మంగళవారం నలుగురు సీనియర్ ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమీషనర్‌గా ఉన్న వీకే సింగ్‌ను రాష్ట్ర పోలీస్ అకాడమీ ఛైర్మన్‌గా నియమించగా.. గోపికృష్ణను ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమీషనర్‌గా నియమించింది.

ఫైర్ సర్వీసెస్ డీజీగా సంజయ్ కుమార్‌‌ను నియమించి..  సంతోష్ మెహ్రాను డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.