హైదరాబాద్‌లో దారుణం జరిగింది. ఓ మహిళపై నలుగురు కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే... ఒడిశా రాష్ట్రం బలంగీర్ జిల్లాకు చెందిన 30 ఏళ్ల వివాహిత తన భర్త, కుమారుడితో కలిసి ఉపాధి కోసం హైదరాబాద్‌కు వచ్చారు.

మహేశ్వరం ప్రాంతంలోని ఇటుకల బట్టీలో దంపతులిద్దరు పనికి చేరారు. అయితే ఒడిషాకే చెందిన నలుగురు యువకులు కూడా అక్కడే పనిచేస్తుంటారు. ఈ క్రమంలో వివాహితపై కన్నేసిన కామాంధులు శుక్రవారం రాత్రి ఆమె బహిర్భూమికి వెళ్లగా యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

భర్త సాయంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఈ దారుణానికి పాల్పడిన వారిని రాహూల్ మాజీ, మనోజ్ సమారత్, దుర్గా సమారత్, దయా మాజీగా గుర్తించారు.