రోడ్డు ప్రమాదాలు  చాలా కుటుంబాలలో విషాదాన్ని నింపుతున్నాయి. ఎక్కవగా ప్రమాదాలు మానవ తప్పిందాల వల్లే జరుగుతున్నాయి అనేది స్ఫసృష్టం. నిద్రమత్తు, అతి వేగం, లాంటి తప్పిందాల కారణంగా అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. 

తాజాగా  నిజామాబాద్ జిల్లా బిక్కునూర్  సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం ఓ కుటుంబాన్ని చిన్నభిన్నం చెసింది. నిజామాబాద్‌ పట్టణంలోని పద్మనగర్‌లో అద్దె ఇంటిలో నివాసం ఉంటున్న అరుణ్‌ స్ధానికంగా ఉపాది లభించకపోవడంతో ఇరాక్ వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో అతని అక్కడ పని దొరికింది.

 శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి అతనికి అర్ధరాత్రి విమానం ఉండడంతో  అక్కడికి వెళ్లేందుకు ఇంటి యజమాని మంతెన లావణ్య ను కారు అడిగాడు. దానికి సరే అన్న ఆమె, అలాగే హైదరాబాద్‌లో హాస్టల్‌లో ఉండి చదువుకుంటున్న కుమారుడిని చూసేందుకు తను, కూతురు లావణ్య కూడా వస్తామని అరుణ్‌కు చెప్పారు. దీంతో తన బంధువైన  డ్రైవర్‌ సుశీల్‌ను స్నేహితుడు  ప్రశాంత్‌తో కలిపి మెుత్తం ఐదుగురు  కారులో హైదరాబాద్‌ వెళ్లారు.


ఎయిర్‌పోర్టులో అరుణ్‌ను దింపారు తర్వాత లావణ్య తన కుమారుడిని కలుసుకొని తిరుగు ప్రయాణమయ్యారు. తెల్లావారిజామున 4.30 గంటల ప్రాంతంలో భిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామం వద్ద డ్రైవర్‌ నిద్రమత్తులోకి జారుకోవడంతో వాహనం అదుపుతప్పింది. పక్కన ఉన్న మర్రి చెట్టును బలంగా ఢికొట్టడంతో అందులో ఉన్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాద సమయంలో కారు బెలూన్లు తెరచుకోలేదు. లేకుంటే వారు బతికేవారేమో?. నిర్లక్ష్యంగా ఉంటే తెల్లవారుజాము ప్రయాణాలు ప్రాణాలు తీస్తాయని ఈ ఘటనతో మరోసారి రుజువైంది.

ఇందులో మరిణించిన వారందరివి విషాద గాధలే  మంతెన లావణ్య మరణించిన రోజే ఆమె పుట్టిన రోజు కావడం, అలాగే ఈ ప్రమాదంలో చిన్న వయస్సులోనే ప్రాణాలు కోల్పొయిన  ప్రశాంత్‌ది  మరో దీనగాథ ఇది. ఆర్థికంగా చితికిపోయిన ఆ కుటుంబానికి బీబీఏ చదివిన ప్రశాంత్‌ అసరగా నిలుస్తారు అనుకున్నారు.కానీ ఈ ప్రమాదం అతన్ని తీరాని లోకాలకు చేర్చింది.  అలాగే ఇరాక్‌కు వెళ్తున్న పెద్దమ్మ కుమారుడు అరుణ్‌కు వీడ్కోలు చెప్పేందుకు డ్రైవర్‌గా వెళ్ళిన సుశీల్‌‌ను   రోడ్డు ప్రమాదం అనంత లోకాలకు తీసుకెళ్లింది.  వీరు మృతితో కుటుంబ సభ్యులు రోధనలు మిన్నంటాయి.  ఆర్మూర్‌లో విషాదాఛాయలు అలుముకున్నాయి.