హన్మకొండ జిల్లాలో ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. మరణించిన వారిని వరంగల్ కాశీబుగ్గ సొసైటీకి చెందిన వారిగా గుర్తించగా.. మృతుల్లో ఇద్దరు మహిళలు వున్నారు. 

హన్మకొండ జిల్లాలో ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. ఆత్మకూరు, కటాక్షాపూర్‌ మధ్య కారును టిప్పర్ ఢీకొట్టింది. దీంతో కారు నుజ్జునుజ్జయ్యింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా వుంది. ఆదివారం సమ్మక్క సారలమ్మ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మరణించిన వారిని వరంగల్ కాశీబుగ్గ సొసైటీకి చెందిన వారిగా గుర్తించగా.. మృతుల్లో ఇద్దరు మహిళలు వున్నారు.