చిత్తుగా తాగేసి కారు నడిపాడు: ముగ్గురు చిన్నారులతో సహా నలుగురు బలి

First Published 20, Apr 2019, 5:44 PM IST
4 died in road accident at warangal district
Highlights

వరంగల్‌లో దారుణం జరిగింది. వేసవి సెలవుల్లో సరదాగా గడిపేందుకు బంధువుల ఇంటికి వెళుతున్న చిన్నారుల పాలిట మందుబాబులు యమభటులయ్యారు. 

వరంగల్‌లో దారుణం జరిగింది. వేసవి సెలవుల్లో సరదాగా గడిపేందుకు బంధువుల ఇంటికి వెళుతున్న చిన్నారుల పాలిట మందుబాబులు యమభటులయ్యారు.

వరంగల్ రూరల్ జిల్లా కొమ్మాల సమీపంలో బైకును కారు ఢీకొట్టడంతో ముగ్గురు చిన్నారులు దుర్మరణం పాలవ్వగా.. మరో చిన్నారిని స్థానికులు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రాణాలు కోల్పోయింది.

చెన్నారావుపేటకు చెందిన అనిల్ సోదరి ఇంటికి వచ్చి తన పిల్లలతో పాటు మేనకోడళ్లను తీసుకుని జెల్లికి బయలుదేరారు. మార్గమధ్యంలో వీరు ప్రయాణిస్తున్న బైక్‌ను వేగంగా దూసుకొచ్చిన కారు ఢీకొట్టింది.

ప్రమాదానికి కారణమైన కారును మద్యంలో మత్తులో ఉన్న యువకులు ఢీకొట్టినట్లుగా పోలీసులు తెలిపారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మరణించడంతో బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

loader