మహబూబాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఈతకు వెళ్లిన నలుగురు బాలురు ప్రాణాలు కోల్పోయారు. శనిగాపుపరం బొడాతాండకు చెందిన నలుగురు బాలురు దగ్గరలోని చెరువులో ఈతకు వెళ్లి, ప్రమాదవశాత్తూ మునిగి చనిపోయారు.

మృతులను జగన్, దినేశ్, లోకేశ్, రాకేశ్‌లుగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాలను వెలికి తీశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఒకేసారి నలుగురు చిన్నారులు మరణించడంతో తండాలో విషాదం అలుముకుంది.

కాగా గత మంగళవారం సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం అన్నారం కొత్తచెరువులో ఈతకు వెళ్లి ముగ్గురు బాలురు మరణించిన సంగతి తెలిసిందే.