తెలంగాణలో కొత్తగా 366 కరోనా కేసులు నమోదవ్వగా.. ఇద్దరు మృతి చెందారు. 345 మంది వైరస్ నుంచి కోలుకోగా.. తెలంగాణలో ప్రస్తుతం 6,295 యాక్టివ్‌ కేసులు వున్నాయి.

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 80,470 కరోనా పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 366 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 102 కొత్త కేసులు వెల్లడవ్వగా... కరీంనగర్ జిల్లాలో 34, వరంగల్ అర్బన్ జిల్లాలో 27, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 27 కేసులు గుర్తించారు. అదే సమయంలో 345 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. తాజా కేసులతో రాష్ట్రంలో ఇప్పటివరకు వైరస్ బారిన పడిన వారి సంఖ్య 6,56,098కి చేరుకుంది. మొత్తం 6,45,939 మంది ఆరోగ్యవంతులయ్యారు. ప్రస్తుతం తెలంగాణలో 6,295 మంది చికిత్స పొందుతున్నారు. అటు, తాజా మరణాలతో కలిపి వైరస్ సోకి ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 3,864కి పెరిగింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే.. ఆదిలాబాద్ 3, భద్రాద్రి కొత్తగూడెం 7, జీహెచ్ఎంసీ 102, జగిత్యాల 8, జనగామ 4, జయశంకర్ భూపాలపల్లి 1, గద్వాల 1, కామారెడ్డి 3, కరీంనగర్ 34, ఖమ్మం 19, మహబూబ్‌నగర్ 4, ఆసిఫాబాద్ 2, మహబూబాబాద్ 4, మంచిర్యాల 8, మెదక్ 2, మేడ్చల్ మల్కాజిగిరి 27, ములుగు 2, నాగర్ కర్నూల్ 2, నల్గగొండ 24, నారాయణపేట 1, నిర్మల్ 2, నిజామాబాద్ 3, పెద్దపల్లి 15, సిరిసిల్ల 6, రంగారెడ్డి 13, సిద్దిపేట 12, సంగారెడ్డి 5, సూర్యాపేట 8, వికారాబాద్ 1, వనపర్తి 1, వరంగల్ రూరల్ 9, వరంగల్ అర్బన్ 27, యాదాద్రి భువనగిరిలో 6 చొప్పున కేసులు నమోదయ్యాయి.


Scroll to load tweet…