తెలంగాణలో అంతకంతకూ పెరుగుతోన్న కరోనా.. కొత్తగా 3,557 కేసులు, హైదరాబాద్‌లో అత్యధికం

తెలంగాణలో (telangana corona cases) కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 1,11,178 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 3,557 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఇప్పటివరకు తెలంగాణలో కోవిడ్ బారినపడిన వారి సంఖ్య 7,18,196కి చేరింది

3557 new corona cases reported in telangana

తెలంగాణలో (telangana corona cases) కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 1,11,178 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 3,557 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఇప్పటివరకు తెలంగాణలో కోవిడ్ బారినపడిన వారి సంఖ్య 7,18,196కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కరోనాతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటివరకు తెలంగాణలో వైరస్ వల్ల (covid deaths in telangana) మరణించిన వారి సంఖ్య 4,065కి చేరుకుంది. వైరస్ బారి నుంచి నిన్న 1,773 మంది కోలుకున్నారు. తెలంగాణలో ప్రస్తుతం 24,253 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో అత్యధికంగా 1,474 కేసులు నమోదయ్యాయి.  

ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే.. ఆదిలాబాద్ 30, భద్రాద్రి కొత్తగూడెం 72, జీహెచ్ఎంసీ 1474, జగిత్యాల 35, జనగామ 19, జయశంకర్ భూపాలపల్లి 27, గద్వాల 30, కామారెడ్డి 24, కరీంనగర్ 74, ఖమ్మం 104, మహబూబ్‌నగర్ 66, ఆసిఫాబాద్ 28, మహబూబాబాద్ 46, మంచిర్యాల 77, మెదక్ 37, మేడ్చల్ మల్కాజిగిరి 321, ములుగు 23, నాగర్ కర్నూల్ 35, నల్గగొండ 46, నారాయణపేట 16, నిర్మల్ 26, నిజామాబాద్ 58, పెద్దపల్లి 70, సిరిసిల్ల 20, రంగారెడ్డి 275, సిద్దిపేట 64, సంగారెడ్డి 123, సూర్యాపేట 42, వికారాబాద్ 52, వనపర్తి 28, వరంగల్ రూరల్ 30, హనుమకొండ 130, యాదాద్రి భువనగిరిలో 55 చొప్పున కేసులు నమోదయ్యాయి.

కాగా.. దేశంలో కరోనా వైరస్ (Coronavirus) మరోసారి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. గత రెండు రోజులుగా కొత్త కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గినప్పటికీ.. మరోసారి కరోనా పంజా విసిరింది. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 2,82,970 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇది కిందటి రోజు కేసులతో పోల్చితే 18.9 శాతం ఎక్కువ. తాజా కేసులతో కలిపి భారత్‌లో మొత్తం కేసుల సంఖ్య 3,79,01,241కి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం ఉదయం బులిటెన్ విడుదల చేసింది. కొత్త కేసులలో కర్ణాటక 41,457, మహారాష్ట్ర 39,207, కేరళ 28,481, తమిళనాడు 23,888 , గుజరాత్‌ 17,119లతో టాప్‌ 5లో నిలిచాయి. 

గడిచిన 24 గంటల్లో కరోనాతో 441 మృతించెందారు. దీంతో దేశంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 4,87,202కి చేరింది. తాజాగా కరోనా నుంచి 1,88,157 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కరోనాను జయించిన వారి సంఖ్య 3,55,83,039కి చేరింది. ప్రస్తుతం దేశంలో 18,31,000 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక, దేశంలో కరోనా పాజిటివిటీ రేటు భారీగా పెరిగింది. రోజువారి పాజివిటీ రేటు 15.13 శాతంగా, వీక్లీ పాజిటివిటీ రేటు 15.53 శాతంగా ఉన్నట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశంలో ప్రస్తుతం కరోనా రికవరీ రేటు 93.88 శాతంగా ఉంది. యాక్టివ్ కేసుల శాతం 4.83 శాతం, మరణాల రేటు 1.29 శాతంగా ఉంది. 

మరోవైపు దేశంలో ఒమిక్రాన్ కేసులు కూడా పెరుగుతున్నాయి. దేశంలో ఇప్పటివరకు 8,961 Omicron కేసులు నమోదైనట్టుగా కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇది కిందటి రోజుతో పోలిస్తే 0.79 శాతం కంటే ఎక్కువ అని తెలిపింది. ఇక, మంగళవారం (జనవరి 18) రోజున దేశంలో 18,69,642 శాంపిల్స్‌ను పరీక్షించినట్టుగా ఐసీఎంఆర్ వెల్లడించింది. దీంతో దేశంలో ఇప్పటివరకు పరీక్షించిన శాంపిల్స్ సంఖ్య 70,47,21, 650కి చేరినట్టుగా తెలిపింది. మరోవైపు దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతుంది. నిన్న దేశంలో 76,35,229 డోసుల వ్యాక్సిన్ పంపిణీ జరిగింది. దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1,58,88,47,554కి చేరింది. 
 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios