Asianet News TeluguAsianet News Telugu

రైలు నిలయంలో 30 మందికి కరోనా: రెండు రోజుల కార్యాలయం మూసివేత

సౌత్ సెంట్రల్ రైల్వే (దక్షిణ మధ్య రైల్వే) జోనల్ కేంద్రంలో కరోనా కల్లోలం సృష్టించింది. జోనల్ కేంద్రం రైలు నిలయంలో పనిచేసే సుమారు 30 మంది ఉద్యోగులు కరోనా వైరస్ బారిన పడ్డారు. 

30 Railway employees tested corona positive at rail nilayam in secunderabad
Author
Hyderabad, First Published Sep 14, 2020, 2:22 PM IST


హైదరాబాద్: సౌత్ సెంట్రల్ రైల్వే (దక్షిణ మధ్య రైల్వే) జోనల్ కేంద్రంలో కరోనా కల్లోలం సృష్టించింది. జోనల్ కేంద్రం రైలు నిలయంలో పనిచేసే సుమారు 30 మంది ఉద్యోగులు కరోనా వైరస్ బారిన పడ్డారు. 

రైలు నిలయంలో పనిచేసే 30 మందికి కరోనా సోకడంతో  వారంతా చికిత్స తీసుకొంటున్నారు. హోం క్వారంటైన్ కే పరిమితమయ్యారు.ఈ 30 మంది ఉద్యోగులతో ఎవరెవరు సన్నిహితంగా ఉన్నారనే విషయమై ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. వారంతా కూడ  పరీక్షలు చేయించుకోవాలని కూడ రైల్వే ఉన్నతాధికారులు ఆదేశించారు.

రైలు నిలయంతో పాటు   కరోనా సోకిన ఉద్యోగులు పనిచేసే చాంబర్లను  శానిటైజేషన్ చేశారు. మరో వైపు ఇక్కడ పనిచేస్తున్న 30 మందికి కరోనా సోకడంతో రైలు నిలయాన్ని రెండు రోజుల పాటు మూసివేయాలని నిర్ణయం తీసుకొన్నారు.రాష్ట్రంలో కరోనా కేసులు 1,57,096కి చేరుకొన్నాయి. కరోనాతో తెలంగాణ రాష్ట్రంలో 961 మంది మరణించారు. 

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులను అదుపుచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకొంటుంది. గతంలో జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా కేసుల ఉధృతి ఎక్కువగా ఉండేవి. ప్రస్తుతం జీహెచ్ఎంసీలో కేసలు ఉధృతి తగ్గింది. జిల్లాల్లో కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతోంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios