Asianet News TeluguAsianet News Telugu

పోలీసులు తనిఖీల్లో పట్టుబడ్డ 30 కిలోల వెండి ...ఆర్టీసి బస్సులో తరలిస్తూ

తెలంగాణ ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవకతవకలు జరక్కుండా రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు, ఈసి అధికారులు తనిఖీలు చేపడుతున్న విషయం తెలిసిందే. ఇలా నల్గొండ జిల్లాలో పోలీసులు చేపట్టిన తనిఖీల్లో ఏకంగా 30 కిలోల వెండి పట్టుబడింది. అదీ ఓ ఆర్టీసి బస్సులో పట్టుబడటం సంచలనంగా మారింది. 

30 kg silver caught police search in nalgonda district
Author
Nalgonda, First Published Dec 1, 2018, 8:24 PM IST

తెలంగాణ ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవకతవకలు జరక్కుండా రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు, ఈసి అధికారులు తనిఖీలు చేపడుతున్న విషయం తెలిసిందే. ఇలా నల్గొండ జిల్లాలో పోలీసులు చేపట్టిన తనిఖీల్లో ఏకంగా 30 కిలోల వెండి పట్టుబడింది. అదీ ఓ ఆర్టీసి బస్సులో పట్టుబడటం సంచలనంగా మారింది. 

తనిఖీల్లో భాగంగా పోలీసులు ఇప్పటివరకు ముఖ్యంగా కార్లు, ప్రైవేట్ వాహనాల్లోనే తనిఖీలు నిర్వహించారు. ఆర్టీసి బస్సుల్లో సామాన్య ప్రజలే అధికంగా ప్రయాణిస్తారు కాబట్టి వాటిపై అంతగా దృష్టి పెట్టలేదు. ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ఓటర్లను మభ్యపెట్టేందుకు  ధన ప్రవాహం పెరిగే అవకాశం ఉండటంతో పోలీసులు ప్రతి వాహనాన్ని తనిఖీ చేయడం మొదలుపెట్టారు. ఇలా నల్గొండ జిల్లా తిప్పర్తి వద్ద ఆర్టీసి బస్సులో సోదా చేయగా ఓ ప్రయాణికుడి వద్ద భారీ ఎత్తున వెండి లభించింది. ఆ వెండికి సంబంధించిన పత్రాలు కూడా సదరు ప్రయాణికుడి వద్ద లేకపోవడంతో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎన్నికల అధికారులకు వెండిని అప్పగించారు. పట్టుబడిన వెండికి సంబందించి తగిన పత్రాలు చూపిస్తే అప్పగిస్తామని పోలీసులు తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios