భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం జరిగింది. మతిస్థిమితం లేని బాలికపై ముగ్గురు యువకులు గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే పట్టణానికి చెందిన ఓ మతిస్థిమితం లేని బాలికపై కన్నేసిన ముగ్గురు కామాంధులు ఆమెను బైక్‌పై ఎక్కించుకుని శివారులోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డారు.

అనంతరం ఆమెను ఓ గుంతలో పడేసి పరారయ్యారు. తన కుమార్తె కనిపించకపోవడంతో ఆమె తండ్రి చుట్టు పక్కల ప్రాంతాల్లో వెతికాడు. ఓ గుంతలో ఏడుపు వినిపించడంతో స్థానికుల సాయంతో కుమార్తెను బయటకు తీసి ఇంటికి తీసుకెళ్లాడు..

ఆ బాలిక కడుపు నొప్పి అని ఏడవటంతో అత్యాచారం జరిగినట్లు గుర్తించారు. దీనిపై బాలిక తండ్రి మణుగూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.