హైద్రాబాద్ హైదద్రాబాద్ లోని  అంబర్‌పేటలోని పెరల్ ఫంక్షన్ హల్ గోడ కూలి నలుగురు మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.. ఫంక్షన్ హల్ లో పెళ్లి జరుగుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకొంది.

ఆదివారం నాడు పెరల్ గార్డెన్ ఫంక్షన్ హాల్‌లో పెళ్లి జరుగుతున్న సమయంలో ఈ ఘటన  చోటు చేసుకొంది. గాయపడిన వారిని యశోద  ఆసుపత్రికి తరలించారు. గార్డెన్ బయట ఉన్న పార్కింగ్ ఏరియాలో ఉన్న ఆటోలు, బైక్‌లపై కూర్చొన్న వారిపై గోడ కూలింది.దీంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. శిథిలాల కింద ఉన్న వారిని బయటకు తీసి యశోదా ఆసుపత్రికి తరలించారు.

"

శిథిలాల కింద ఇంకా ఎవరైనా చిక్కుకొన్నారా అనే కోణంలో రెస్క్యూ ఆపరేషన్స్ చేపట్టారు. శిథిలాల కింద 10 బైక్ లు, రెండు ఆటోలు చిక్కుకొన్నాయి. క్షతగాత్రులకు యశోద ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

గాయపడిన వారి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు ప్రకటించారు. ఈ ఫంక్షన్ హల్ చాలా పురాతనమైంది. ఫంక్షన్ హల్ నిర్వాహకులు గోడ విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

ఒక్కసారిగా గోగ కుప్పకూలడంతో గోడ పక్కనే వారిపై గోడ శిథిలాలు పడ్డాయి. రెస్క్యూ టీమ్ శిథిలాల కింద ఉన్నవారిని రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. జీహెచ్ఎంసీ రెస్క్యూ టీమ్ సిబ్బంది, పోలీసులు, స్థానికులు శిథిలాాల కింద ఉన్న వారిని రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ గోడ కూలిపోవడానికి గల కారణాల గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు.

 

మృతుల కుటుంబాలకు రెండు లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. మరో వైపు ఈ ఘటనపై పెరల్ ఫంక్షన్ హల్ నిర్వాహకులపై క్రిమినల్ కేసు పెడతామని ఈస్ట్‌జోన్ డీసీపీ రమేష్ చెప్పారు. మరోవైపు సంఘటన స్థలాన్ని జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ సందర్శించారు.ఫంక్షన్ నిర్వాహకుల నిర్లక్ష్యం స్పష్టంగా కన్పిస్తోందని డీసీపీ రమేష్ అభిప్రాయపడ్డారు.